ETV Bharat / business

తొలిదశ పూర్తి చేసుకున్న మరో దేశీయ వ్యాక్సిన్​! - కరోనా వైరస్ వ్యాక్సిన్

ప్రేమాస్ బయోటెక్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను జంతువులపై విజయవంతంగా ప్రయోగించినట్లు సంస్థ వెల్లడించింది. ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు తెలిపింది. తర్వాతి దశ ప్రయోగాల కోసం ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

Premas Biotech
వ్యాక్సిన్​
author img

By

Published : Aug 27, 2020, 9:20 PM IST

ప్రేమాస్ బయోటెక్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్​.. తొలి దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని ఆ సంస్థ ప్రకటించింది. జంతువుల్లో పరీక్షించగా తటస్థమైన రోగనిరోధక స్పందనను ప్రేరేపించినట్లు గుర్తించామని తెలిపింది.

తర్వాతి దశ ప్రయోగాలకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రేమాస్​ బయోటెక్​ ఓ ప్రకటనలో తెలిపింది.

"ఎలుకలపై చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. మనుషులపై ప్రయోగాలు చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నాం" అని ప్రేమాస్ బయోటెక్​ సహావ్యవస్థాపకుడు ఎండీ ప్రబుద్ధ కుందు తెలిపారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.