టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివరి త్రైమాసికంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో లాభం 38 శాతం వృద్ధితో 11.6 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 14 శాతం పెరిగి 36.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది.
వినియోగదారుల ఉత్పత్తులు, వ్యాపార సేవల్లో నమోదైన భారీ అమ్మకాలు ఈ లాభాలకు ప్రోత్సాహమందించినట్లు పేర్కొంది టెక్ దిగ్గజం.
కన్జూమర్ సాఫ్ట్వేర్ సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్.. వైవిద్యభరితమైన వ్యాపారాలపై అధికంగా దృష్టి సారించి విజయాలు అందుకుంటుందనే విషయాన్ని ఈ లాభాలు నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఆఫీస్ సాఫ్ట్వేర్ సూట్, సామాజిక మాధ్యమం లింక్డ్‌ఇన్‌లు సహా సంస్థ ఉత్పాదకత వ్యాపారాల ఆదాయం 2019 డిసెంబర్ త్రైమాసికంలో 17 శాతం పెరిగింది.
ఇదీ చూడండి:సెల్‌ఫోన్ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?