ETV Bharat / business

పేటీఎం ద్వారా పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్లు విరాళం

వినియోగదారుల సహకారంతో పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్లకుపైగా విరాళంగా అందించినట్లు పేటీఎం సంస్థ తెలిపింది. పేటీఎం ద్వారా ప్రభుత్వ నిధికి విరాళం అందించే ఒక్కో చెల్లింపునకు ఈ సంస్థ రూ.10 జమ చేస్తోంది.

Paytm
పేటీఎం
author img

By

Published : Apr 11, 2020, 1:39 PM IST

డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం వేదికగా 10 రోజుల్లో పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్లకు పైగా విరాళం సేకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ నిధికి తమ ద్వారా ఎవరైనా విరాళం ఇస్తే.. వారు చెల్లించే మొత్తానికి రూ.10 అదనంగా జమ చేస్తామని పేటీఎం ప్రకటించింది. ఈ విధంగా కరోనా సంక్షోభ నిధికి మొత్తం రూ.500 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. రోజువారీ కూలీలకు ఆహారం అందించేందుకు కేవీఎన్ ఫౌండేషన్​తో కలిసి పనిచేస్తోంది పేటీఎం.

"10 రోజుల్లో విరాళాలు రూ.100 కోట్లు దాటాయి. మా సంస్థ ఉద్యోగులు కూడా వారి జీతాలను విరాళంగా ఇచ్చారు. 1,200 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. 15 రోజులు, నెల, రెండు నెలలు, 3 నెలల జీతం.. ఇలా వారికి సాధ్యమైనంత మేర విరాళంగా ఉచ్చారు."

- పేటీఎం ప్రకటన

కరోనాపై పోరుకు ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరారు పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్.

కార్పొరేట్ సంస్థలూ..

పీఎం కేర్స్ నిధికి దిగ్గజ కార్పొరేటు సంస్థలు కూడా భారీ విరాళాలను ప్రకటించాయి.

  • టాటా ట్రస్ట్, టాటా గ్రూపు - రూ.1,500 కోట్లు
  • విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ - రూ. 1,125 కోట్లు
  • ఇన్ఫోసిస్ ఫౌండేషన్ - రూ.100 కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లతో పాటు వందల కోట్ల రూపాయలతో కరోనా వైరస్ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మించింది. పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేసింది. అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తోంది.

ఇదీ చూడండి: రూ.500 నోట్లు చూసి గజగజ వణికిన స్థానికులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.