ETV Bharat / business

పేటీఎం x గూగుల్.. వయా ఐపీఎల్ క్యాష్​ బ్యాక్! - గూగుల్​పై పేటీఎం ఆరోపణలు

దేశీయ డిజిటల్ ఫినాన్స్ సేవల సంస్థ పేటీఎం, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్​ మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. గూగుల్.. తమ యాప్​లో క్యాష్​ బ్యాక్ ఆఫర్​ను తొలగించాలని ఒత్తిడి చేయడంపై పేటీఎం విమర్శలు చేసింది. గూగుల్ సొంత సంస్థ గూగుల్ పే లోనూ ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నా.. దానికి ప్రత్యేక నిబంధనలు వర్తింపచేస్తున్నట్లు ఆరోపించింది.

Paytm Google Controversy
గూగుల్​పై పేటీఎం ఆరోపణలు
author img

By

Published : Sep 21, 2020, 2:10 PM IST

క్యాష్​ బ్యాక్ నిబంధనల విషయంలో టెక్​ దిగ్గజం గూగుల్​పై..​ దేశీయ డిజిటల్ ఫినాన్స్ సేవల సంస్థ పేటీఎం పలు ఆరోపణలు చేసింది. భారత్​లో చట్టబద్ధమైన యూపీఐ క్యాష్​ బ్యాంక్​ ఆఫర్లను ఉపసంహరించుకునేలా తమపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొంది.

గూగుల్ మాత్రం క్యాష్​బ్యాక్​లు, ఓచర్లు ఇవ్వడం మాత్రమే.. గూగుల్​ ప్లే జూదం నిబంధనల ఉల్లంఘన కాదని అంటోంది. ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే.. గూగుల్ ప్లే డెవలపర్స్ ఖాతాను తొలగిస్తామని కూడా హెచ్చరించింది.

అయితే దీనిపై పేటీఎం వాదన మరోలా ఉంది. క్రికెట్​కు సంబంధించి.. దాదాపు ఇలాంటి ఆఫర్లనే గూగుల్ పే కూడా అందిస్తోందని.. అయితే గూగుల్ తన సొంత యాప్​లకు మాత్రం ప్రత్యేక నిబంధనలు పెట్టుకున్నట్లు ఆరోపించింది.

ఇదీ జరిగింది..

ఐపీఎల్​ ప్రారంభం నేపథ్యంలో.. జూదం పాలసీ నిబంధనల ఉల్లంఘన కింద శుక్రవారం కొద్ది గంటల పాటు పేటీఎంను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. పేటీఎంకు ఈ విషయంపై పలుమార్లు నోటీసులు పంపినా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

పేటీఎం క్యాష్​ బ్యాక్ ఆఫర్​ను తొలగించాక తిరిగి ప్లే స్టోర్​లో యాప్​ను పునరుద్ధరించింది గూగుల్.

ఇదీ చూడండి:రూ. 97 వేల కోట్ల రుణ ప్రతిపాదనకే ఆ రాష్ట్రాలు ఓటు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.