ఈ ఏడాది మేలో దేశీయంగా వాహనాల అమ్మకాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే భారీగా తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ (సియామ్) తాజా గణాంకాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
విభాగాల వారీగా వాహనాల అమ్మకాలు ఇలా..
వాహనాలు | విక్రయమైన యూనిట్లు 2018 మే లో - 2019 మేలో | తగ్గుదల |
ప్యాసింజర్ కార్లు | 3,01,238 - 2,39,347 | 20.55 % |
సాధారణ కార్లు | 1,99,479 - 1,47,546 | 26.03 % |
మోటార్ సైకిళ్లు | 12,22,164 - 11,62,373 | 4.89% |
ద్విచక్ర వాహనాలు | 18,50,698 - 17,26,206 | 6.73 % |
వాణిజ్య వాహనాలు 2018 మేతో పోలిస్తే.. 2019 మేలో 10.22 శాతం తగ్గి 68,847 యూనిట్లు విక్రయమైనట్లు సియామ్ పేర్కొంది.
కేటగిరీల వారీగా చూస్తే 2019 మేలో 20,86,358 యూనిట్లు విక్రయమైనట్లు సియామ్ తెలిపింది. 2018 మేలో అమ్ముడైన 22,83,262 యూనిట్లతో పోలిస్తే ఇవి 8.62 శాతం తక్కువ.