అతిథ్య రంగ సంస్థ ఓయో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఓకు సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి వచ్చేవారం దరఖాస్తు సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రూ.7.4 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్లు సమీకరించే లక్ష్యంతో ఓయో ఐపీఓకు రానున్నట్లు సమాచారం.
ఐపీఓ నిర్వహణకు జేపీ మోర్గన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్లను ఓయో నియమించికున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఓయో నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఐపీఓకు ముందే భారీగా నిధులను కూడా సమీకరించుకుంది ఓయో. గత నెలలోనే మైక్రోసాఫ్ట్ 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దానికి ముందు గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి టీం లోన్ బీ (టీఎల్బీ)గా.. 660 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకుంది. ప్రస్తుతం ఓయో మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల పైమాటేనని అంచనా.
ఇదీ చదవండి: Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?