ETV Bharat / business

కరోనాతో 70 శాతం అంకురాలు కుదేలు!

కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు తీవ్రంగా కుదేలయ్యాయి. ముఖ్యంగా నిధుల కొరత, వ్యాపార కార్యకలాపాల్లో క్షీణత వంటి గడ్డు పరిస్థితులు ఏర్పడాయి. కరోనా సంక్షోభం అంకుర సంస్థలపై ఎంతలా పడింది అనే అంశంపై ఓ సర్వే వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.

corona impact on startups
అంకురాలపై కరోనా ప్రభావం
author img

By

Published : Jul 6, 2020, 11:38 AM IST

కరోనా మహమ్మారి కారణంగా దేశీయంగా దిగ్గజ సంస్థలే కుదేలయల్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంకురాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇదే విషయమై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫిక్కీ), ఇండియన్ ఏంజెల్ నెట్​వర్క్(ఐఏఎన్​)​లు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఇందులో అంకురాలపై కరోనా, లాక్​డౌన్​ల ప్రభావం గురించి పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలోని ముఖ్యంశాలు..

  • సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 250 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. అందులో 70 శాతం కరోనా వల్ల తమ వ్యాపారాలు ప్రభావితమైనట్లు వెల్లడించాయి.
  • 12 శాతం అంకురాలు ఇప్పటికే కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపాయి.
  • లాక్​డౌన్​ను ఇంకా పొడగిస్తే.. తాము ఉద్యోగాల కోత విధించక తప్పదని 30 శాతం అంకురాలు తెలిపాయి.
  • 43 శాతం స్టార్టప్​లు ఏప్రిల్ నుంచి జూన్​ మధ్య ఉద్యోగుల వేతనాల్లో 20-40 శాతం కోతలు విధించినట్లు తెలిపాయి.
  • పెట్టుబడుల విషయాన్ని తమ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు 33 శాతం అంకుర సంస్థలు తెలిపాయి. మరో 10 శాతం స్టార్టప్​లు తమ ఒప్పందాలు నిలిచిపోయినట్లు వెల్లడించాయి.
  • 8 శాతం అంకురాలు మాత్రమే..లాక్​డౌన్​కు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం తమకు నిధులు అందినట్లు తెలిపాయి.
  • నిధుల కొరత వల్ల వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు స్టార్టప్​లు ఆందోళన వ్యక్తం చేశాయి.
  • సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 96 శాతం మంది తమ పెట్టుబడులు కరోనా వల్ల తగ్గించినట్లు అంగీకరించారు. 92 శాతం మంది రానున్న ఆరు నెలల వరకు పెట్టుబడులు వృద్ధి చెందకపోవచ్చని చెప్పుకొచ్చారు.
  • ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్​లు తిరిగి పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి అత్యవసర ఉపశమన ప్యాకేజీ అవసరమని సర్వే అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:వైరస్​ను కడిగే ఫోన్​ సోప్​ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.