ETV Bharat / business

'వివాద్​ సే విశ్వాస్​'తో రూ.లక్ష కోట్ల పన్ను పరిష్కారం! - వివాద్​ సే విశ్వాస్​ పథకం పూర్తి వివరాలు

పన్ను వివాదాల పరిష్కారానికి భారీగా డిమండ్ పెరుగుతోందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎంచుకున్న కంపెనీలు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే.. రూ.లక్ష కోట్ల పన్ను పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

Rs 1 lakh cr of disputed tax to be settled as Vivad Se Vishwas scheme
వివాద్ సే విశ్వాస్​ ద్వారా ఇప్పటి వరకు సెటిల్ అయిన మొత్తం
author img

By

Published : Jan 3, 2021, 9:40 PM IST

ప్రభుత్వంతో పన్ను వివాదాల్లో చిక్కుకున్న 5 లక్షల కంపెనీల్లో ఐదింట ఒక శాతం కంపెనీలు 'వివాద్​ సే విశ్వాస్' పథకాన్ని ఎంచుకున్నట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఆదివారం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు రూ.83,000 కోట్ల పన్ను వివాదానికి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం 'వివాద్​ సే విశ్వాస్'​ పథకాన్ని గత ఏడాది తీసుకొచ్చింది కేంద్రం. వివిధ అప్పీలేట్ ఫోరమ్​ల వద్ద పెండింగ్​లో ఉన్న 4.8 లక్షల అప్పీళ్ల ద్వారా మొత్తం రూ.9.32 లక్షల పన్ను వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం.

పన్ను వివాదాల్లో చిక్కుకున్న వారి నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడగించింది కేంద్రం.

'ఈ పథకాన్ని ఎంచుకున్న కంపెనీలు నిర్దేశించిన పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనితో వ్యాజ్యాలు మూసివేయడం సహా ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు' అని అజయ్ భూషణ్ పాండే అన్నారుర.

ఇదీ చూడండి:'సరళ్​ జీవన్ బీమా' వచ్చేసింది- వివరాలివే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.