ETV Bharat / business

రూ.20వేలకే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీ

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్​ఫోన్ల తయారీ సంస్థ వన్​ప్లస్​ స్మార్ట్​ టీవీని జులైలో మార్కెట్లోకి తేనుంది. దీని ధర రూ. 20వేల లోపే ఉండొచ్చని అంచనా. చౌకరకం టీవీల మార్కెట్లో విపరీతమైన పోటీతో ఈ టీవీని తీసుకొస్తోందీ సంస్థ.

OnePlus Smart TV
రూ.20వేలకే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీ
author img

By

Published : Jun 10, 2020, 10:35 AM IST

మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ సరికొత్త స్మార్ట్‌ టీవీని వచ్చేనెలలో విడుదల చేయనుంది. ఈ టీవీ ధర రూ.20వేల లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ప్రీమియం విభాగంలో రూ.69,990 ధరతో క్యూ1 సిరీస్‌ టీవీని తీసుకొచ్చింది. అప్పట్లోనే రూ.20వేల లోపు ధరలో కూడా స్మార్ట్‌ టీవీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

సోమవారం కంపెనీ సీఈవో పెటే లౌ మాట్లాడుతూ త్వరలో సరికొత్త టీవీని తీసుకువస్తున్నామని తెలిపారు. అనంతర్‌ వన్‌ప్లస్‌ ఇండియా కూడా ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్‌ చేసింది. జులై 2వ తేదీన దీనిని విడుదల చేస్తామని ఆ ట్వీట్‌లో పేర్కొంది. దీని ధర కూడా 1X,999గా ఉంటుందని వెల్లడించింది. 'హేవీ స్పేస్‌.. ఈజీ ప్రైస్‌' అంటూ టీజర్‌ను విడుదల చేసింది. అమెజాన్‌లో దీనికి డెడికేటెడ్‌ పేజీని కూడా షేర్‌ చేసింది.

చైనాకు చెందిన మరో సంస్థ షియోమీ నుంచి చౌకరకం టీవీల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉండటంతో వన్‌ప్లస్‌ దీనిని మార్కెట్లోకి తెస్తోంది. వేర్వేరు సైజుల్లో ఈ సరికొత్త టీవీ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి: ఐటీఆర్​-1 ఫారంతో రిటర్నుల దాఖలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.