వచ్చే ఏడాది జనవరి నుంచి సేవింగ్స్ ఖాతాదారులకు నెఫ్ట్ ఛార్జీల రద్దుకానున్నాయి. పొదుపు ఖాతాదారుల నుంచి నెఫ్ట్ ఛార్జీలు వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. పెద్ద నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
అదే విధంగా ఇప్పటి వరకు టోల్గేట్ కోసం వినియోగిస్తోన్న 'ఫాస్ట్ ట్యాగ్'ను పార్కింగ్, పెట్రోల్ బంకుల్లో రుసుములు చెల్లించేందుకు వినియోగించేలా ప్రతిపాదన తీసుకువ్చచింది ఆర్బీఐ.
డిజిటల్ లావాదేవీలు వృద్ధికి..
డిజిటల్ లావాదేవీలను పెంచే లక్ష్యంతో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు వసూలు చేయరాదని ఇటీవల నిర్ణయించింది ఆర్బీఐ. ఇందులో భాగంగానే బ్యాంకులకు తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందజేయాలని సూచించింది. దీనికి సంబంధించి వారంలోగా మార్గదర్శకాలు జారీచేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది రిజర్వు బ్యాంకు.
పెద్దమొత్తంలో నగదు బదిలీలకు ఆర్టీజీఎస్‌ను ఉపయోగిస్తుండగా... రెండు లక్షల్లోపు నగదు బదిలీలకు నెఫ్ట్‌ను వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్ల తగ్గింపు