ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్​ అంబానీ@4 - RELIANCE NEWS

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో మరో మెట్టు ఎక్కారు. బ్లూమ్​బెర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ ప్రకారం ఎల్​వీఎంహెచ్​ ఛైర్మన్​ బెర్నార్డ్​ ఆర్నాల్ట్​ను దాటేసి నాలుగో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 80.6 బిలియన్​ డాలర్లుగా ఉంది.

AMBANI 4TH
ప్రపంచ కుబేరుల్లో ముఖేశ్‌ @ 4
author img

By

Published : Aug 8, 2020, 6:58 PM IST

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరో మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన మరో మెట్టు పైకి ఎక్కారు. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటేసి 80.6 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

దిగ్గజాలను వెనక్కి నెట్టి..

ముకేశ్‌ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌, సెర్జీ బ్రిన్‌, ల్యారీ పేజ్‌, వారెన్‌ బఫెట్‌ వంటి దిగ్గజాలను దాటేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 187 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బిల్‌గేట్స్‌ 121 బిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో నిలిచారు. 102 బిలియన్‌ డాలర్లతో ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆర్నాల్ట్‌ 80.2 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు.

పెట్టుబడుల ప్రవాహంతో..

ఈ ఏడాది ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు పడిపోవడం వల్ల ఆర్నాల్ట్‌ సంపద 25.1 బిలియన్‌ డాలర్ల మేర కోసుకుపోయింది. అదే సమయంలో ముకేశ్‌ సంపద 22 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా ఆయిల్‌ మార్కెట్‌ దెబ్బతిన్నప్పటికీ.. రిలయన్స్‌ డిజిటల్‌ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ముకేశ్‌కు కలిసొచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. మరోవైపు ముకేశ్‌ ఇప్పటికే ఈ-కామర్స్‌ వ్యాపారంపై దృష్టి సారించారు.

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.