అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. బ్రిటన్‌కు చెందిన మరో ప్రముఖ కంపెనీని కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్ కోర్స్ కలిగిన స్టోక్ పార్క్‌ను సొంతం చేసుకుంది. ఈ ఒప్పంద విలువ 79 మిలియన్ డాలర్లు. దీంతో రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్ పార్క్ కూడా భాగం కానుంది.
ఇంధనేతర రంగంలోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ముకేశ్ అంబానీ ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆటబొమ్మల సంస్థ హామ్లిస్‌ను కొనుగోలు చేశారు. దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలు ఉన్న ఈ రంగంలోకి హామ్లిస్‌తో ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. అలాగే వినియోగ ఆధారిత సేవా రంగాలపై ముకేశ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్‌లోకి ప్రవేశించారు.
ఇదీ చదవండి:రిలయన్స్ ఉద్యోగులకు మే 1 నుంచి ఉచిత టీకా