ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఫేస్బుక్ సహా ఐదు సంస్థలు జియోలో భారీగా పెట్టుబడి పెట్టగా.. ఆ జాబితాలో మరో కంపెనీ చేరింది. అబుదాబికి చెందిన 'ముబ్దాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ' జియోలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ముబ్దాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి 1.85 శాతం వాటను రూ.9,093.60 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ముబ్దాలా వాటా కొనుగోలుతో కలిపి ఆరు వారాల్లోనే జియోకి మొత్తం రూ.87,655.35 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
'ముబ్దాలా' పెట్టుబడి తర్వాత జియో ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్ప్రైజెస్ విలువ రూ.5.16 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ వెల్లడించింది.
జియోలో విదేశీ కంపెనీల వాటాలు ఇలా..
ఇదీ చూడండి:ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా!