భారత సార్వభౌమ రేటింగ్‌ను తగ్గించిన మరుసటి రోజే 8 ఆర్థికేతర రంగ సంస్థల రేటింగ్‌ను దిగువకు సవరించింది మూడీస్ ఇన్వెస్టర్స్. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, ఆయిల్ ఇండియా, ఐఓసీ, బీపీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ రేటింగ్లను తగ్గించింది. వీటి భవిష్యత్ అంచనాలు ప్రతికూలంగా ఉంచింది మూడీస్.
మూడు దిగ్గజ బ్యాంకులు ఎన్‌బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎగ్జిమ్ బ్యాంక్ రేటింగ్‌ను బీఏఏ 2 నుంచి బీఏఏ 3కు తగ్గించింది. వీటి భవిష్యత్ అంచనాలనూ నెగెటివ్‌గా ఉంచింది మూడీస్.
వీటితో పాటు దేశంలోని ఏడు ప్రధాన మౌలిక సదుపాయాల సంస్థలైన ఎన్టీపీసీ, ఎన్హెచ్ఏఐ, గెయిల్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్‌ల రేటింగ్‌ను తగ్గించింది.
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం, సావరిన్ రేటింగ్ తగ్గింపు వంటి అంశాలు ఈ సంస్థల రేటింగ్‌లో కోతకు ప్రధాన కారణంగా మూడీస్ వెల్లడించింది.