దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వృద్ధి వేగంగా మందగమనానికిలోనై.. ఉద్యోగాల కోత, సంపద ఆవిరికి కారణమవుతున్న రంగాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన పరిష్కారాల గురించి సమాలోచనలు చేశారు.
వరుసగా ఆరో ఏడాది ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మోదీ సమావేశమయ్యారు.
ముఖ్యంగా వృద్ధి మందగమనం, ధీర్ఘకాలంలో వాటి ప్రభావాలపై చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు. త్వరలోనే రంగాల వారీగా ఉద్దీపన పథకాలతో ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో చర్చించిన ఇతర అంశాలు వెల్లడించేందుకు నిరాకరించారు అధికారి.
ఇదీ చూడండి: ఇంద్రధనుస్సు తలపాగాతో మెరిసిన మోదీ