ETV Bharat / business

భారతీయ యాప్​లో మైక్రోసాఫ్ట్​ భారీ పెట్టుబడి! - షేర్​ చాట్​లో మైక్రోసాఫ్ట్​ ఒప్పందం

దేశీయ సోషల్ మీడియా యాప్​ షేర్​ చాట్​లో మైక్రోసాఫ్ట్​ భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ఇప్పటికే టిక్​టాక్​ వంటి దిగ్గజ షార్ట్ వీడియో యాప్​ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్​.. షేర్​ చాట్​లో 100 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Microsoft investment in Share chat
షేర్​ చాట్​లో మైక్రోసాఫ్ట్​ భారీ పెట్టుబడి
author img

By

Published : Aug 7, 2020, 3:00 PM IST

అమెరికాకు చెందిన టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​.. సోషల్​ మీడియా యాప్​లపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వైపు టిక్​టాక్​ కొనుగోలు చర్చలు జరుపుతూనే.. దేశీయ సోషల్​ మీడియా యాప్​ షేర్​ చాట్​లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది

షేర్​ చాట్​లో మొత్తం 100 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షేర్​ చాట్​ సంస్థ ఇటీవల నిధులు సమీకరించాలని నిర్ణయించిన మొత్తంలో మైక్రోసాఫ్ట్​ పెట్టుబడి మూడో వంతుకు సమానమని తెలిసింది.

షేర్​ చాట్​కు ప్రస్తుతం 14 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఏడాది కూడా ఈ సంస్థ 100 మిలియన్​ డాలర్ల నిధులు సమీకరించుకుంది.

తెలుగు, హిందీ, తమిళ్​ సహా మొత్తం 15 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. స్థానిక భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల.. టైర్​-2, టైర్​-3 పట్టణాల నుంచే ఈ యాప్​కు అధిక యూజర్లు ఉన్నారు.

ఇదీ చూడండి:'టిక్​టాక్'​పై నిషేధానికి ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.