ETV Bharat / business

Air India news: 'ఎయిర్​ ఇండియా' వార్తలను ఖండించిన ప్రభుత్వం..!

author img

By

Published : Oct 1, 2021, 3:52 PM IST

Updated : Oct 1, 2021, 3:58 PM IST

ఎయిర్​ ఇండియా(Air India news) పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో బిడ్లకు(Air India disinvestment bids ) కేంద్రం ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఆ వార్తలు తప్పు అని పేర్కొంది కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం. ఏదైనా నిర్ణయం తీసుకుంటే(air india disinvestment news) మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

Air India disinvestment bids
ఎయిరిండియా

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణలో(Air India news) కీలక ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు(Air India disinvestment bids) చేయగా.. టాటా సన్స్‌ను (Tata sons Air India) విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కానీ, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఈ బిడ్డింగ్‌లో టాటా గ్రూపు విజయం సాధించినట్లు వచ్చిన కథనాలు సరికాదని పేర్కొంది. ఎయిర్​ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ(air india disinvestment) వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు వచ్చిన వార్తలు తప్పు అని పేర్కొంటూ కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి ట్విట్టర్‌లో స్పష్టంచేశారు. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

  • Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS

    — Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు ఈ అంశంపై టాటా సన్స్‌ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ఎయిర్​ ఇండియా(Air India news) సైతం స్పందించలేదు. అయితే, టాటా సన్స్‌ దాఖలు చేసిన బిడ్‌ ఆకర్షణీయంగా ఉందని గతకొన్ని రోజులుగా వివిధ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి.

అక్టోబరు 15 (దసరా) నాటికి విజయవంతమైన బిడ్డర్‌ పేరును ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్నది స్పష్టత రావాల్సి ఉంది. గత నెల 29న ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బిడ్‌ మొత్తంలో ఎయిర్​ ఇండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్​ ఇండియా కోసం చాలా సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. టాటా సన్స్‌(Tata sons Air India) సహా స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ కూడా ఆర్థిక బిడ్లు సమర్పించారు.

రేసులో టాటాలే ముందు..

ప్రభుత్వం ఇటీవలే ఎయిర్ ఇండియా 'మినిమం రిజర్వ్‌ ప్రైస్‌' ఖరారు చేసినట్లు గురువారం వార్తలు వెలువడ్డాయి. భవిష్యత్తులో క్యాష్‌ ఫ్లో అంచనాలు, బ్రాండ్‌ విలువ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్ల ఆధారంగా రిజర్వ్‌ ప్రైస్‌ను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్​ ఇండియాను(air india disinvestment) దక్కించుకోనే రేసులో టాటాలు ముందు దూకుడుగా ఉన్నారు. అలాగే సంస్థ పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమకూర్చే సత్తా టాటాలకు మాత్రమే ఉందని పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. పైగా వీరికి విమానయాన రంగంలో మంచి అనుభవం కూడా ఉంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో వాటాలు ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎయిర్​ ఇండియాను(Air India news) ప్రారంభించింది టాటాలే(Tata sons Air India) . 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరిట టాటా గ్రూప్‌ విమానయాన రంగంలోకి ప్రవేశించింది. 1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఈ బిడ్లు విజయవంతం అయితే.. 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకే వెళ్ల వచ్చు! అంతా సవ్యంగా సాగితే డిసెంబరు నాటికి ఎయిర్​ ఇండియాలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఎయిర్​ ఇండియా కొత్త యజమాని చేతుల్లోకి వెళ్లిపోతుంది.

ఇదీ చూడండి: టాటాల చేతికి ఎయిర్ఇండియా!

Last Updated : Oct 1, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.