ETV Bharat / business

600 డీలర్​షిప్​లను ప్రారంభించిన మారుతీ సుజుకి

దేశవ్యాప్తంగా 600 డీలర్​షిప్​లు తిరిగి తెరుచుకున్నట్లు ప్రకటించింది దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి. ఇప్పటికే కార్ల డెలివరీ ప్రారంభించామని వెల్లడించింది. వినియోగదారుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని.. షోరూంలకు వెల్లకుండానే వాహనాల కొనుగోలుకు డిజిటల్​ సదుపాయం సహా.. డోర్​ డెలివరీ అందుబాటులోకి తెచ్చామని తెలిపింది.

Maruti
600 డీలర్​షిప్​లను ప్రారంభించిన మారుతీ సుజుకి
author img

By

Published : May 6, 2020, 8:05 PM IST

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్​ఐ) దేశవ్యాప్తంగా 600 డీలర్ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వాహనాల డెలివరీ ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విక్రయ కేంద్రాల్లో సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్​ విధానం (ఎస్​ఓపీ), వాహనాల కొనుగోలు కోసం డిజిటల్​ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.

"గత కొన్ని రోజులుగా మేము దేశవ్యాప్తంగా 600 బేసి డీలర్​షిప్​లను తిరిగి తీసుకురాగలిగాం. విక్రయ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉన్న రాష్ట్రాల్లో డీలర్లు ఇప్పటికే దరఖాస్తు చేశారు. కార్ల డెలివరీలను ప్రారంభించింది. ప్రస్తుతానికి 55 యూనిట్లు అందించాం. దేశవ్యాప్తంగా మొత్తం సేల్స్​ నెట్​వర్క్​ను అందుబాటులోకి తీసుకొచ్చే విషయం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించే దానిపై ఆధారపడి ఉంటుంది. డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా డీలర్ల వద్ద సరిపడా స్టాక్​ ఉంది."

– శశాంక్​ శ్రీవాస్తవ, ఎంఎస్​ఐ ఎక్జిక్యూటివ్​ డైరెక్టర్​, మార్కెటింగ్​ అండ్​ సెల్స్​

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 1,960 నగరాల్లో మొత్తం 3,080 డీలర్​షిప్​లు ఉన్నాయి. ఇప్పటి వరకు 474 సంస్థ విక్రయ కేంద్రాలు, 80 నెక్సా డీలర్​షిప్​లు, 45 వాణిజ్య వాహనాల విక్రయ కేంద్రాలను ప్రారంభించింది. అయితే.. తయారీ కర్మాగారాల కార్యకలాపాలు ప్రస్తుతం మూసి ఉంటాయని తెలిపింది సంస్థ.

అందుబాటులోకి డోర్​ డెలివరీ..

ప్రస్తుతం ప్రారంభమైన డీలర్​షిప్​లలో పూర్తి స్థాయిలో వినియోగదారుల రక్షణ, పరిశుభ్రత, శానిటైజేషన్​ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఎస్​ఐ ఎండీ, సీఈఓ కెనిచి ఆయుకవా తెలిపారు. కొనుగోలుదారులు వాహనాల డెలివరీకి షోరూంలకు వచ్చేందుకు ఉన్న భయాలను తొలగించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. డిజిటల్​ సదుపాయంతో ఇంట్లో నుంచే కొనుగోలు చేయడం సహా.. డోర్​ డెలివరీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు కెనిచి. టెస్ట్​ డ్రైవ్​ వాహనాలకు పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.