ETV Bharat / business

30 వేల కోట్ల డాలర్లకు టాటా గ్రూప్​ మార్కెట్​ విలువ

author img

By

Published : Sep 3, 2021, 9:08 AM IST

దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తున్నా.. టాటా గ్రూపు కంపెనీలపై(Tata Group Companies) పెద్దగా ప్రభావం కనిపించట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణిస్తోంది. ఈ తరుణంలోనే టాటా గ్రూపు మార్కెట్‌ విలువ 30000 కోట్ల డాలర్లకు (రూ.22,50,000 కోట్లు) చేరింది. గ్రూపు కంపెనీల షేర్ల(Tata Share Prices) విలువ 15-375 శాతం దూసుకెళ్లాయని ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది.

market capitalization of Tata group has crossed $300 billion
టాటా గ్రూప్​ మార్కెట్​ విలువ

దేశంలోని ప్రతిష్ఠాత్మక టాటా గ్రూపు మార్కెట్‌ విలువ 30000 కోట్ల డాలర్లకు (రూ.22,50,000 కోట్లు) చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాటా గ్రూపులోని 28 నమోదిత కంపెనీల్లో 27 సంస్థల షేర్లు అద్భుత పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేసింది. ఫలితంగా ఈ సంవత్సరంలోనే టాటా గ్రూపు మార్కెట్‌ విలువ 8475 కోట్ల డాలర్లు (రూ.6,35,000 కోట్లు) పెరిగింది. గ్రూపు కంపెనీల షేర్ల విలువ 15-375 శాతం దూసుకెళ్లాయని ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది.

టీసీఎస్‌దే ముఖ్య భూమిక

టాటా గ్రూపు మొత్తం మార్కెట్‌ విలువలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వాటాయే 52 శాతం. ఆ తర్వాతి స్థానాల్లో టాటా స్టీల్‌ (16.22% వాటా), టాటా మోటార్స్‌ (6.75%), టైటన్‌ (5.07%), టాటా కన్జూమర్‌ లిమిటెడ్‌ (4.1%) ఉన్నాయి.

6 షేర్లు.. 100కి పైగా లాభం..

టాటా గ్రూపులోని ఆరు సంస్థల షేర్లు ఈ ఏడాదిలోనే 100 శాతానికి మించి రాణించాయి. 9 కంపెనీల షేర్లు 50-90%, 12 సంస్థల షేర్లు 15-45% లాభపడ్డాయి. ఒక్క కంపెనీ షేరు సుమారు 1 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

market capitalization of Tata group has crossed $300 billion
టాటా గ్రూప్​ కంపెనీల మార్కెట్​ విలువ పెరిగిందిలా

షేర్ల జోరు.. ఎందుకంటే..

  • టాటా గ్రూపు కంపెనీలపై కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం పెద్దగా లేకపోవడం.. ఒకవేళ పడినా వాటిని తట్టుకొని రాణించడం.
  • గ్రూపు కంపెనీల రుణాలు పరిమితి స్థాయిల్లోపే ఉండటం.
  • అంతర్జాతీయంగా విలాసవంత కార్ల వ్యాపారం పుంజుకోవడం జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌కే కాకుండా, దాని యజమాని టాటా మోటార్స్‌కు కలిసిరావడం.
  • ఉక్కు గిరాకీ పుంజుకోవడం, కమొడిటీ ధరలు పెరగడంతో టాటా స్టీల్‌కు లాభదాయకత పెరగడం.
  • దేశీయంగా వినియోగం పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగవ్వడం, వ్యయ నియంత్రణ చర్యలతో ఆయా విభాగాల వ్యాపారాలు ఆకర్షణీయ పనితీరు కనబర్చడం
  • ఆదాయాల్లో స్థిరమైన వృద్ధి ఉండటం, గ్రూపునకు చెందిన కొన్ని కంపెనీల రేటింగ్‌ను వివిధ రేటింగ్‌ సంస్థలు పెంచడం

మున్ముందూ ఆకర్షణీయమే

ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమం వేగవంతం కావడం.. 2022-23లో ఆకర్షణీయ లాభాలు నమోదు చేయొచ్చన్న అంచనాలతో మున్ముందూ టాటా గ్రూపు షేర్ల దూకుడు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని ఓ బ్రోకరేజీ సంస్థ పేర్కొంటోంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా, తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం గ్రూపు కంపెనీలకు ఉండటంతో మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషిస్తోంది.

కొత్త వ్యాపారాల్లోకి..

ఇంజినీరింగ్‌, తయారీ కార్యకలాపాల నిమిత్తం టాటా ఎలక్ట్రానిక్స్‌ పేరుతో ఓ సంస్థను టాటా గ్రూప్‌ ఏర్పాటు చేసింది. వైద్య పరికరాల తయారీ నిమిత్తం టాటా మెడికల్‌ అండ్‌ డయాగ్నొస్టిక్స్‌, వినియోగ ఆధారిత డిజిటల్‌ వ్యాపారాల కోసం టాటా డిజిటల్‌ను సృష్టించింది.

ఇదీ చూడండి: ఎస్‌బీఐ నుంచి సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను ఎలా కొనాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.