ETV Bharat / business

అంకురాలకు కరోనా కష్టాలు- వెంటాడుతున్న నిధుల లేమి! - అంకురాలపై లోకల్​ సర్కిల్​ సర్వే

కరోనా రెండో దశ ప్రభావంతో స్టార్టప్​లు తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. నిధుల కొరత వల్ల చాలా కంపెనీలు వ్యాపారాలను ముసేయాలనే ఆలోచనలు ఉన్నట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది. మరికొన్ని కొన్ని కంపెనీలు వ్యాపారాలను విక్రయించడం వంటి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడైంది. సర్వేలో తెలిసిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Corona Second wave impact on SMEs
అంకురాలపై కొవిడ్ సెగ
author img

By

Published : May 27, 2021, 9:48 PM IST

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం అంకురాలు, చిన్న సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. లోకల్​సర్కిల్ అనే సంస్థ చేసిన ఈ సర్వేలో 6000 చిన్న తరహా పరిశ్రమలు, స్టార్టప్​లు పాల్గొన్నాయి. ఇందులో మెజారిటీ కంపెనీలు నిధుల కొరత, భవిష్యత్​పై అందోళనల వల్ల తమ వ్యపారాలను తగ్గించుకోవడం, సంస్థను విక్రయించడం లేదా పూర్తిగా ముసేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

నిజానికి కరోనా మొదటి దశ నుంచే అంకురాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. 2020 మార్చిలో దేశవ్యాప్త లాక్​డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం. లాక్​డౌన్​ దెబ్బకు 2020-21 తొలి త్రైమాసికంలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

"కరోనా వల్ల.. అంకురాలు, ఎంఎస్​ఎంఈలు మనుగడ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి." - సచిన్ తాపారియా, లోకల్ సర్కిల్​ వ్యవస్థపాకుడు

పండుగ సీజన్​లో తేరుకున్నా..

గత ఏడాది పండుగ సీజన్​ నేపథ్యంలో అక్టోబర్​-నవంబర్​ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైంది. 2020-21 చివరి త్రైమాసికంలో ఒక శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ విరుచుకుపడింది. ఏప్రిల్​, మే మధ్య ఏకంగా 1,58,000 మందిని పొట్టన బెట్టుకుంది.

'కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​లు, కర్ఫ్యూలు వంటివి ఆర్థిక వ్యవస్థను మరోసారి అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో స్టార్టప్​లు, ఎంఎస్​ఎంఈలు కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, వ్యాపారాన్ని ముందు సాగించడం వంటివి సవాలుగా మారాయి' అని సచిన్ తాపారియా 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

వేధిస్తున్న నిధుల లేమి..

6000 చిన్న సంస్థల్లో 41 శాతం కంపెనీలు తమ వద్ద మరో నెల రోజులకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయని తెలిపాయి. 22 శాతం కంపెనీలు తమ వద్ద ఉన్న నిధులు మరో మూడు నెలలకు సరిపోతాయని వెల్లడించాయి. 11 శాతం కంపెనీలు మాత్రమే 6 నెలలకు సరిపడా నిధులు ఉన్నాయని చెప్పాయి.

ఉద్యోగులకూ చిక్కులు..

  • చిన్న తరహా సంస్థలన్నీ మనుగడ పోరాటంలో భాగంగా.. ఉద్యోగులకు మరణానంతరం ఇచ్చే పరిహారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దాదాపు సగం కంపెనీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.
  • సర్వేలో పాల్గొన్న మొత్తం అంకురాలు, చిన్న సంస్థల్లో 7 శాతం.. ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చులు తగ్గించుకోనున్నట్లు తెలిపాయి.
  • 9 శాతం కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని, ఇతర ప్రయోజనాలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
  • 13 శాతం సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోనున్నట్లు వెల్లడించాయి.
  • మొత్తం మీద 49 శాతం కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పరిహారం, ఇతర ప్రయోజనాలను జులై నుంచి తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించాయి.

ప్రభుత్వ ఉద్దీపన అవసరం..

ఎస్​ఎంఈలు, సార్టప్​లు ప్రభుత్వం నుంచి ఉద్దీపన కావాలని కోరుతున్నాయి. అందులో ఎక్కువ శాతం కంపెనీలు ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరాదారులుగా ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.