కీలక ద్రవ్యోల్బణం గణాంకాలే ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపించున్నాయి. దాదాపు ముగింపు దశకు చేరిన త్రైమాసిక ఫలితాల సీజన్, వారంలో తగ్గనున్న పని దినాలు కాస్త ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఏళ్లనాటి అయోధ్య భూవివాదానికి తెరదించుతూ సుప్రీం కోర్డు ఇచ్చిన సంచలన తీర్పు.. మార్కెట్లపై అంతగా ప్రభావం ఉండకపోచ్చని అంటున్నారు.
సోమవారం పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. చిల్లర ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళ, గురు వారాల్లో విడుదల కానున్నాయి. ఈ గణాంకాల ప్రభావం మార్కెట్లపై అధికంగా ఉండనున్నాయి.
గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం మార్కెట్లు పని చేయవు.
ఈ వారం త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న కంపెనీల్లో కోల్ ఇండియా,హిందాల్కో, ఎన్ఎండీసీలు ఉన్నాయి. వీటి ఫలితాలపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముంది.
ఇదీ చూడండి: 'ఉక్కు' సంకల్పమే.. ఆయన సామ్రాజ్యాన్ని నిర్మించింది