ETV Bharat / business

లాక్​డౌన్​లోనూ స్టార్టప్​లు సూపర్​ హిట్​!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ కారణంగా అంకురాలు సంక్షోభంలో పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. భారత్​లో స్టార్టప్​లు సరికొత్త ప్రతిపాదనలు చేయగా.. వారికి మూలధన ప్రోత్సాహమందించేందుకు వెంచర్ క్యాపిటల్​ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ అంశంపై 'ఈటీవీ భారత్​' అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.

LOCK DOWN IMPACT ON  STARTUPS
చెదరని ధైర్యం
author img

By

Published : Jun 7, 2020, 11:58 AM IST

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలొన్నాయి. భారత్​తో పాటు చాలా దేశాలు లాక్​డౌన్ విధించిన కారణంగా విమానయానం నుంచి అన్ని రవాణా సదుపాయాలు.. అత్యవసరం కాని అన్ని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీని వల్ల ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.

చెదరని ధైర్యం..

ఇలాంటి సంక్షోభంలోనూ దేశంలోని ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు, పెట్టుబడిదారుల మనోధైర్యం చెక్కుచెదరలేదు. ఎందుకంటే లాక్​డౌన్​లోనూ అంకుర సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య.. పెట్టుబడి, నూతన వ్యాపారాలపై చర్చలు జరిగాయి. లాక్​డౌన్​ సమయంలో చాలా మంది ఔత్సాహికులు నూతన వ్యాపారాలకు ప్రతిపాదనలు పంపగా.. వాటికి మూలధనం సమకూర్చేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు.

దరఖాస్తులు పెరిగాయ్​..

లాక్​డౌన్​లో పెట్టుబడుల కోసం స్టార్టప్​ల నుంచి దరఖాస్తులు పెరిగాయని ముంబయికి చెందిన వెంచర్​ క్యాపిటల్​ సంస్థ యూనికార్న్​ ఇండియా వ్యవస్థాపకుడు అనిల్​ జోషి వెల్లడించారు. ఈ సమయంలో తమకు సగటున రోజుకు 8-10 దరఖాస్తులు వచ్చినట్లు 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు.

anil jhoshi
అనిల్​ జోషీ

లాక్​డౌన్​లో పెట్టుబడులు ఇలా..

ఇలా లాక్​డౌన్ సమయంలో వచ్చిన ప్రతిపాదనల్లో 4-5 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు అనిల్​ జోషీ. వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైట్లు పేర్కొన్నారు.

5 మిలియన్ డాలర్లు..

లాక్​డౌన్​ ఉన్నా అంకుర సంస్థలకు మార్చిలో 5 మిలియన్​ డాలర్ల పెట్టుబడి ప్రోత్సాహమందించినట్లు 'సోషల్​ ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ఆవిష్కార్​ గ్రూప్​' తెలిపింది. చెక్​బుక్​ అనే ఫిన్​టెక్​, ఎర్గోస్​ అనే అగ్రిటెక్ అంకురాలకు మూలధన ప్రోత్సాహమందించినట్లు వెల్లడించింది.

కరోనా లాక్​డౌన్​లోనూ తమకు పెట్టుబడి కోసం వారానికి 50-60 దరఖాస్తులు అందినట్లు ఆవిష్కార్​ గ్రూప్​ మేనేజింగ్ పార్ట్​నర్​ సుష్మా కౌశిక్ 'ఈటీవీ భారత్'​తో తెలిపారు. ఈ పరిణామాలు గమనిస్తే.. కొత్త వ్యాపారాలు, పెట్టుబడులపై లాక్​డౌన్​ ప్రభావం చూపలేకపోయిందని సుష్మ అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్​లాంటి గడ్డు పరిస్థితుల్లోనూ కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు అవకాశాలు భారీగా ఉన్నాయన్నారు. ఈ సమయంలో అంకురాల పనితీరును ఆమె ప్రశంసించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక రథం కదలాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.