ETV Bharat / business

బుకింగ్స్​లో కియా ఎస్​యూవీ 'సెల్టోస్​' జోరు - ఎస్​యూవీ సెల్పోస్​

కియా మోటార్స్ రూపొందించిన ఎస్​యూవీ 'సెల్టోస్​' బుకింగ్స్​లో దూసుకెళ్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇది అసాధారణ విజయమని కియా మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు అన్నారు.

కియా మోటార్స్
author img

By

Published : Jul 18, 2019, 3:08 PM IST

'ఎస్​యూవీ సెల్టోస్​'ను ఆగస్టు 22న భారత్​లో ఆవిష్కరించనుంది కియా మోటార్స్​. దక్షిణ కొరియాకు చెందిన ఈ ఆటోమొబైల్ దిగ్గజం ప్రీ బుకింగ్స్​కు భారీ స్పందన వస్తోంది. ఈ నెల 16న ప్రీ బుకింగ్స్​ను ప్రారంభించగా... మొదటి రోజే 'సెల్టోస్​'​ కోసం 6,046 బుకింగ్స్​ వచ్చినట్లు వెల్లడించింది. వీటిలో 1,628 బుగింగ్స్ ఆన్​లైన్​ ద్వారా వస్తే.. మిగతా బుకింగ్స్ దేశ వ్యాప్తంగా 160 పట్టణాల్లో ఉన్న తమ డీలర్​షిప్​ల ద్వారా వచ్చినట్లు పేర్కొంది.

"ఇది అసాధారణ విజయం. కియా మోటార్స్​కు అద్భుతమైన గుర్తింపు. మా బ్రాండ్​ ప్రచారమే ఈ విజయానికి కారణం. " -మనోహర్​ బాత్​, కియా మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు

ఏడాదికి 3 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో కియా మోటార్స్ భారత్​లో ప్లాంటును నెలకొల్పింది. దీని ద్వారా నిర్ణీత సమయానికి వినియోగదారులకు వాహనాలు అందించాలని చూస్తోంది.

ఇదీ చూడండి: మాల్యా అప్పీలుపై వచ్చే ఫిబ్రవరిలో వాదనలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.