ETV Bharat / business

ప్రత్యర్థుల పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లకు జియో వల! - జియో పోస్ట్​పెయిడ్​

ప్రత్యర్థి టెలికాం సంస్థల పోస్ట్​పెయిడ్​ వినియోగదారులను ఆకర్షించటమే లక్ష్యంగా రిలయన్స్​ జియో ప్రత్యేక ఆఫర్​ను ప్రకటించింది. ఇతర నెట్​వర్క్​ నుంచి జియోలోకి వచ్చే పోస్ట్​పెయిడ్​ కస్టమర్లు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించకుండానే క్రెడిట్​ లిమిట్​ను కొనసాగించవచ్చని వెల్లడించింది.

Jio
రిలయన్స్​ జియో
author img

By

Published : Oct 10, 2020, 5:08 AM IST

ఇటీవలే కొత్త పోస్ట్​ పెయిడ్​ ప్లాన్లు ప్రవేశపెట్టిన టెలికాం దిగ్గజం జియో.. మరో అడుగు ముందుకేసింది. ప్రత్యర్థి నెట్​వర్క్​ల పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులను ఆకర్షించేందుకు పోస్ట్​ పెయిడ్​ సెక్యూరిటీ ఫీజును మాఫీ చేసింది. ఇతర నెట్​వర్క్​ల నుంచి జియోకి మారితే ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయబోమని ప్రకటించింది. ప్రస్తుత చందాదారులకు కంపెనీ అందించే క్రెడిట్​ పరిమితిని అందిస్తున్నట్లు తెలిపింది.

" రిలయన్స్​ జియో ఇప్పుడు పోస్ట్​ పెయిట్​ ప్లస్​ ప్లాన్స్​లోకి చేరిన ఇతర ఆపరేటర్ల పోస్ట్​పెయిడ్​ కస్టమర్ల కోసం క్రెడిట్​ పరిమితిని తొలిసారి కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఎలాంటి అదనపు, సెక్యూరిటీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. "

- జియో సంస్థ అధికారి.

జియో తమ పోస్ట్​ పెయిడ్​ ప్లస్​ ప్లాన్స్​లో 500 జీబీ వరకు డేటాతో పాటు నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్స్​ అందిస్తోంది. ఈ క్రమంలో పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లు వినియోగించని తమ డేటాను తదుపరి నెలలో వాడుకునే వీలు కల్పిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వాట్సాప్​ నంబర్​కు మెసేజ్​ చేయటంతో పాటు ప్రస్తుత ఆపరేటర్​ పోస్ట్​పెయిడ్​ బిల్స్​ను అప్​లోడ్​ చేయటం ద్వారా జియో నెట్​వర్క్​ పొందవచ్చని తెలిపారు.

జియో సంస్థ ప్రస్తుతం 39 కోట్ల వినియోగదారులతో దేశంలోనే నంబర్​ వన్​ స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చూడండి: జియో కొత్త ప్లాన్ల​తో- ఎయిర్​టెల్, వీ విలవిల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.