ETV Bharat / business

స్టాక్ మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ అప్పుడే! - జియో ఐపీఓ ఎప్పుడు

2025 నాటికి భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో వాటా 48 శాతానికి చేరొచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ సమయానికి జియో యూజర్ల సంఖ్య 50 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టింది. జియో ఐపీఓపై కూడా ఈ నివేదిక పలు అంచనాలు వేసింది. ఆ విశేషాలు మీ కోసం.

jio Ipo
జియో ఐపీఓ
author img

By

Published : Jun 17, 2020, 5:07 PM IST

ముకేశ్​ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రానున్న రోజుల్లో భారత మార్కెట్​పై మరింత పట్టు సాధిస్తుందని బెర్న్​స్టెయిన్ అనే సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. 2025 నాటికి టెలికాం మార్కెట్​లో జియో వాటా 48 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఈ సమయానికి జియో యూజర్ల సంఖ్య 50 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టింది.

నివేదికలోని అంశాలు..

  • 2019-20లో జియోకు మొత్తం 38.8 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
  • 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50 కోట్ల​ యూజర్ల మార్క్​ అందుకుంటుంది.
  • యూజర్ల సంఖ్య 2024-25 నాటికి 56.9 కోట్లు, 2027-28 నాటికి 60.9 కోట్లకు పెరగొచ్చు.
  • జియో మార్కెట్ వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 38 శాతం నుంచి 40 శాతానికి పెరగొచ్చు. 2024-25 నాటికి 48 శాతానికి చేరొచ్చు.

ఐపీఓ ఎప్పుడు?

  • టెలికాం రంగంలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంటే రానున్న కొన్నేళ్లలోనే జియో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సగటు యూజర్ ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా పెరగొచ్చు.
  • రానున్న మూడేళ్లలో సేవాల ద్వారా జియో ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది.

పెట్టుబడులు..

గత ఏడాది డిసెంబర్​లో జియోను టెలికాం రంగ రారాజుగా పేర్కొన్నామని బెర్న్​స్టెయిన్ తెలిపింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా ఇదే నిర్ణయానికి రావడం చూస్తేనే ఉన్నామని చెప్పుకొచ్చింది.

జియోలో పెట్టుబడుల ప్రవాహాన్ని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ ప్రారంభించింది. రూ.43,573.62 కోట్లతో పెట్టుబడితో జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో ఎనిమిది వేర్వేరు సంస్థలు రూ.60,753.33 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

జియోలో మొత్తం 22.38 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.04 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.