గడచిన ఐదేళ్లలో సమాచార సాంకేతిక రంగంలో 8.73 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆయన విమర్శించారు. నాస్కామ్ గణాంకాల మేరకే ఈ లెక్కలున్నాయని స్పష్టం చేశారు.
''కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలి. యూపీఏ హయాంలో భారత్ అవినీతికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఎన్నో అక్రమాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ప్రస్తుతం ఐటీ రంగంలో 41.40 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాది కల్పిస్తున్నాం''
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ మంత్రి
గత కొన్ని సంవత్సరాల్లో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల వృద్ధి.. ఉద్యోగాల కల్పనకు తోడ్పడినట్లు పేర్కొన్నారు.