ఆన్‌లైన్ వేదికగా నిర్వహించే సెమినార్లపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కాస్త అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న పదం వెబినార్. వెబ్ సెమినార్లనే ‘వెబినార్స్’గా పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ పదమే మహీంద్రా ఆగ్రహానికి కారణమైంది.
వెబినార్ కోసం తనకు మరో ఆహ్వానం వస్తే, చాలా కోపం రావొచ్చేమోనన్నారు. ఈ అంశంపై నెట్టింట్లో ఆయనకు మద్దతు కూడా లభించింది.
-
If I get one more invitation to a ‘webinar’ I might have a serious meltdown. Is it possible to petition for banishing this word from the dictionary even though it was a relatively recent entrant?? pic.twitter.com/2iBQtqoUa6
— anand mahindra (@anandmahindra) May 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If I get one more invitation to a ‘webinar’ I might have a serious meltdown. Is it possible to petition for banishing this word from the dictionary even though it was a relatively recent entrant?? pic.twitter.com/2iBQtqoUa6
— anand mahindra (@anandmahindra) May 28, 2020If I get one more invitation to a ‘webinar’ I might have a serious meltdown. Is it possible to petition for banishing this word from the dictionary even though it was a relatively recent entrant?? pic.twitter.com/2iBQtqoUa6
— anand mahindra (@anandmahindra) May 28, 2020
" 'వెబినార్' కోసం నాకు మరో ఆహ్వానం వస్తే నాకు తీవ్రంగా కోపం రావొచ్చేమో. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదం వాడకం పెరిగినప్పటికీ, డిక్షనరీ నుంచి దాన్ని నిషేధించేలా పిటిషన్ వేయడం సాధ్యమవుతుందా??"
- ఆనంద్ మహీంద్రా
అలాగే ఓ అంశంపై ఉచితంగా వెబినార్‌లో పాల్గొనవచ్చంటూ ఉన్న ఓ చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. వెంటనే నెటిజన్లు ఆయన ప్రతిపాదనకు మద్దతు పలుకుతూ ట్వీట్లు చేశారు.
"నిజంగా సర్, కొవిడ్ భయం కంటే వెబినార్ ఎక్కువ భయం కలిగిస్తుంది. ఇది మళ్లీ ప్రజలు ఆఫీసులకు వెళ్లేందుకు కారణమవుతుంది", "నేను మీతో పూర్తిగా అంగీకరిస్తాను", "నలుగురు వ్యక్తుల కలిస్తే వెబినార్ చార్మినార్ అవుతుంది" అంటూ ట్వీట్లు చేశారు.