ETV Bharat / business

భారత మార్కెట్లోకి మరో 5జీ ​ఫోన్- ధర కాస్త ఎక్కువే!

author img

By

Published : Feb 25, 2020, 4:59 PM IST

Updated : Mar 2, 2020, 1:08 PM IST

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. వివో సబ్​ బ్రాండ్ 'ఐక్యూ' నేడు ఈ మోడల్​ను ఆవిష్కరించింది. దేశంలో ఈ సంస్థ విడుదల చేసిన తొలి స్మార్ట్​ఫోన్ కూడా ఇదే. ఐక్యూ 3 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లు, ధర వివరాలు మీకోసం.

iQoo 3 5G phone launched in India
భారత మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్​ఫోన్​

భారత స్మార్ట్​ఫోన్ మార్కట్లోకి మరో కొత్త సంస్థ ప్రవేశించింది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ వివో సబ్​ బ్రాండ్​గా ఐక్యూ పేరుతో దేశీయ విపణిలోకి వచ్చింది. 'ఐక్యూ3' పేరుతో 5జీ స్మార్ట్​ఫోన్​ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది ఈ సంస్థ.

మూడు వేరియంట్లలో..

8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ సామర్థ్యాలతో ఈ స్మార్ట్​ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది ఐక్యూ. వీటి ధరలు వరుసగా రూ.36,990, రూ.39,990, రూ.44,990గా నిర్ణయించింది.

ఐక్యూ 3 అమ్మకాలు వచ్చే మార్చి 4న ప్రారంభం కానున్నాయి. iqoo.com, ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ ద్వారా లావాదేవీలు, అన్ని రకాల ఈఎంఐలపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.

ఫీచర్లు..

  • 6.44 అంగుళాల ఫుల్​ హెచ్​డీ+అమోలెడ్ డిస్​ప్లే
  • వెనుక వైపు నాలుగు కెమెరాలు (48ఎంపీ+13ఎంపీ+13ఎంపీ+2ఎంపీ)
  • రియర్​ కెమెరాతో 20x జూమ్​ సదుపాయం
  • 16 మెగా పిక్సెళ్ల పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా
  • స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్
  • 4440 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్​ (15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ నింపే సామర్థ్యం)
  • యూఎస్​బీ టైప్​ సీ ఛార్జింగ్​ పోర్ట్​
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్​

ఇదీ చూడండి:రియల్​మీ నుంచి ఈ ఏడాది 20 స్మార్ట్​ డివైజ్​లు

Last Updated : Mar 2, 2020, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.