బకాయిలు సకాలంలో చెల్లిస్తామని జెట్ ఎయిర్వేస్ ఇచ్చిన హామీతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) సరఫరాను పునరుద్ధరించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ). బకాయిలు పెరిగిపోయిన కారణంగా జెట్‌కు ఏటీఎఫ్ సరఫరా నిలివేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది ఐఓసీ. కాసేపు సరఫరాను నిలిపివేసింది.
ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఏయిర్వేస్కు ఈ నిర్ణయంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో దేశ వ్యాప్తంగా చాలా విమానాశ్రయాల్లో జెట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
తీవ్ర రుణభారంతో ఉన్న జెట్ యాజమాన్య బాధ్యతలను ఇటీవలే రుణదాతల కన్సార్షియాలనికి నేతృత్వం వహిస్తున్న ఎస్బీఐ చేజిక్కించుకుంది. తక్షణ అవసరాలకు రూ.1,500 కోట్ల నిధులు సమకూర్చింది నూతన యాజమాన్యం. అయితే సంస్థ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కావాల్సిన నిధులు మాత్రం ఇంకా సమకూరడం లేదు.