స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్లో నమోదుచేసిన భారీ నష్టాల కారణంగా మదుపరుల సంపద ఒక్క రోజులోనే రూ. 2,22,304.65 కోట్లు ఆవిరైంది.
అంచనా వేసినట్టుగానే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గిస్తూ ఆర్బీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావంతో బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ బ్యాంకింగేతర ఆర్థిక రంగ సంక్షోభంపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది.
సూచీల కదలిక ఇలా...
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి.. 40 వేల రికార్డు స్థాయిని కోల్పోయింది. చివరకు 39,530 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 177 పాయింట్ల నష్టానికి చేరి 11,844 పాయింట్ల వద్ద సెషన్ ముగించింది.
ఇదీ చూడండి: రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు