గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కార్పొరేట్లకు 34 శాతంగా ఉన్న సుంకాన్ని 25 శాతానికి తగ్గిస్తూ కేంద్రం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా వెల్లువెత్తిన కొనుగోళ్లు చివరి వరకు కొనసాగాయి.
ఈ భారీ కొనుగోళ్లతో బీఎస్ఈ నమోదిత కంపెనీల్లో మదుపరుల సంపద రూ.6,82,938.6 కోట్లు పెరిగింది. తాజా వృద్ధితో మదుపరుల పూర్తి సంపద 1,45,37,378.01 కోట్లకు చేరింది.
ఇదూ చూడండి: కార్పొరేట్ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: మోదీ