ETV Bharat / business

తెలుగు సహా 9 భాషల్లో వెబ్​సైట్​ పూర్తిపేరు!

వెబ్​సైట్ చిరునామా మాతృభాషలో ఉంటే ఎంత బావుండేదోనని అనుకునే నెటిజన్లకు శుభవార్త. ప్రాంతీయ భాషలోనే పూర్తి సైట్ చిరునామా ఇచ్చేందుకు ప్రపంచ ఇంటర్నెట్ సర్వర్లు సిద్ధమవుతున్నాయి. జూన్​ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

తొమ్మిది భారతీయ భాషల్లో వెబ్​సైట్
author img

By

Published : Apr 2, 2019, 3:25 PM IST

ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే ఆంగ్ల భాషలో వెబ్​సైట్ అడ్రస్ టైప్ చేయటం మాత్రమే మనకు తెలుసు. మాతృభాష ఒక్కటే తెలిసినవారికి ఇది కొంత ఇబ్బందే. ఇలాంటివారికి తీపి కబురందించింది యూనివర్సల్​ ఆక్సెప్టెన్స్​ స్టీరింగ్​ గ్రూప్​ (యుఏఎస్​జీ). తెలుగు, తమిళం సహా తొమ్మిది భారతీయ భాషల్లో జూన్​ నుంచి వెబ్​సైట్​ పేర్ల నమోదు ప్రక్రియ అందుబాటులోకి రానుందని ప్రకటించింది.

ప్రస్తుతం ఇంగ్లీష్​తో పాటు మాండరిన్​, అరబిక్​, రష్యన్​, దేవనాగరి భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

హిందీకి సంబంధించి ఎక్స్​టెన్షన్​ పదంగా ".భారత్(డాట్ భారత్)" అందుబాటులో ఉంది. ఈ పదం అనుసంధానంతో దేవనాగరి భాషల్లో వెబ్​సైట్​ను అంతర్జాలంలో నమోదు చేసుకోవచ్చు.

వచ్చే జూన్​ నుంచి తెలుగు, తమిళం, గుజరాతీ, బెంగాలీ, గుర్ముఖీ, కన్నడ, మళయాళం, ఒడియా భాషల్లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

లేబుల్​ జెనరేషన్​ రూల్స్​(ఎల్​జీఆర్​)పై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 9 భారత ప్రాంతీయ భాషలను ఐసీఏఎన్​ఎన్​(ఇంటర్నెట్​ కార్పొరేషన్​ ఫర్​ అసైన్డ్​ నేమ్స్​ అండ్​ నంబర్స్​) రూట్​ సర్వర్​లకు అనుసంధానం చేయనున్నారు.

"కేవలం ప్రాంతీయ భాషల్లోనే అంతర్జాలాన్ని వినియోగించుకోగల వందకోట్ల మంది భారతీయులకు ఈ సేవలు ఎంతగానో తోడ్పడతాయి. సమాచార భద్రత, స్థానికీకరణ సమస్యలను చాలా వరకు తీరుస్తాయి. మరో బిలియన్ మంది ఆంగ్లేతర భాష మాట్లాడేవారిని ఆన్​లైన్​కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. వివిధ సంస్థలు, సాఫ్ట్​వేర్​ డెవలపర్లు, ఇంటర్నెట్ సంస్థలూ స్థానిక భాషల్లోనూ ఈ-మెయిల్స్​ అంగీకరించేలా, ప్రపంచవ్యాప్తంగా వారి వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తాం."
- అజయ్​ డేటా, యుఏఎస్​జీ ఛైర్మన్​

ఇదీ చూడండి :పాక్​ సైనికులను మట్టుబెట్టిన భారత జవాన్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.