ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.8,260 కోట్లతో చేపట్టిన భారీ బై బ్యాక్ ముగిసింది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన బై బ్యాక్ ద్వారా ఆగస్టు 26 వరకు మొత్తం 11.05 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.
బై బ్యాక్ పూర్తి వివరాలు..
- 20 మార్చి 2019 బై బ్యాక్ ప్రారంభం
- 26 ఆగస్టు 2019 బై బ్యాక్ ముగింపు
- కొనుగోలు చేసిన మొత్తం షేర్లు 11,05,19,266
- ఒక్కో ఈక్విటీ షేర్‌కు వెచ్చించిన మొత్తం రూ.747.38
- బైబ్యాక్‌కు అయిన మొత్తం ఖర్చు రూ.82,59,99,99,430.03
ఇదీ చూడండి: విమానాల్లో ఈ 'యాపిల్' ల్యాప్‌టాప్‌లపై నిషేధం