ETV Bharat / business

ఇండిగో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతనాల్లో కోతల్లేవ్​ - ఇండిగోపై వేతనాల కోత ప్రభావం

ఏప్రిల్ నెలకు గానూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించొద్దన్న కేంద్రం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ రణొజోయ్‌ దత్త తెలిపారు.

FULL SALARY TO INDIGO AIRLINES EMPLOYEES
ఇండిగో ఉద్యోగులకు పూర్తి వేతనం
author img

By

Published : Apr 23, 2020, 4:18 PM IST

Updated : Apr 23, 2020, 5:18 PM IST

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సీనియర్‌ ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్‌ నెల వేతనాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సంస్థ సీఈవో రణొజోయ్‌ దత్త వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉద్యోగులకు మెయిల్‌ చేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు మాత్రం కోత విధించిన వేతనాలు తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. మిగతావారికి పూర్తి వేతనం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ విజ్ఞప్తితో..

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో సంస్థ సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు సీఈఓ మార్చి 19న ప్రకటన చేశారు. అందరికంటే ఎక్కువగా తన వేతనంలోనే 25 శాతం కోత విధించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించొద్దన్న ప్రభుత్వ విజ్ఞప్తిని గౌరవిస్తూ పూర్తి వేతనాల చెల్లింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:హెచ్‌సీఎల్‌లో ఇంటర్‌తోనే ఐటీ ఇంజినీర్‌ ఉద్యోగం

Last Updated : Apr 23, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.