ETV Bharat / business

హెచ్‌సీఎల్‌లో ఇంటర్‌తోనే ఐటీ ఇంజినీర్‌ ఉద్యోగం

గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ పూర్తయిందా... అయితే ఇక ఐటీ ఇంజినీర్‌గా చేరిపోవచ్చు. రాత పరీక్ష దాటి, ఇంటర్వ్యూలో నెగ్గితే శిక్షణ ఇస్తారు. ఉద్యోగంలోకి తీసుకుంటారు. చిన్న వయసులోనే పెద్ద కంపెనీలో మంచి జీతాన్ని అందుకోవటమే కాకుండా... ఉన్నత విద్యనూ కొనసాగించవచ్చు.

IT ENGINEER JOB WITH INTER IN HCL TECH BE EARLY CAREER PROGRAM
ఇంటర్‌తో ఐటీ ఇంజినీర్‌ ఉద్యోగం... హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌
author img

By

Published : Apr 23, 2020, 2:58 PM IST

ఇంటర్‌ విద్యార్హతతో ఐటీ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని అందుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు జరుపుతోంది. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఇస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటే హెచ్‌సీఎల్‌లో ప్రారంభస్థాయి ఐటీ ఇంజినీర్‌గా విధుల్లో చేరొచ్చు. ఉద్యోగం చేస్తూనే ప్రసిద్ధ సంస్థల నుంచి డిగ్రీ కోర్సులనూ చదువుకునే అవకాశం కల్పిస్తారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. తగిన స్కోర్‌ సాధించినవారిని మెరిట్‌ ప్రాతిపదికన ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందులో ఎంపికైతే ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ట్రెయినింగ్‌లో భాగంగా అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ నేర్చుకుంటారు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్స్‌, అసైన్‌మెంట్లు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్లు ఉంటాయి. నెలకు రూ.10 వేలు స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని హెచ్‌సీఎల్‌లో ఫుల్‌టైమ్‌ ఐటీ ఇంజినీర్‌గా తీసుకుంటారు. అప్లికేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సపోర్ట్‌, టెస్టింగ్‌, క్యాడ్‌ సపోర్ట్‌ తదితర విభాగాల్లో వీరు ప్రాథమిక స్థాయి విధులు నిర్వర్తిస్తారు. రూ. 2 లక్షల నుంచి రూ. 2.2 లక్షల వరకు వార్షిక వేతనం (నెలకు రూ.16,600 నుంచి రూ.18,000) అందుతుంది.

అర్హత: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ ఉత్తీర్ణత. 2019లో ఉత్తీర్ణులైనవారు, 2020లో పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మే 10

శిక్షణకు ఎంపికైనవారు రూ.2 లక్షలు+ పన్నులు చెల్లించాలి. కావాలంటే ఈ మొత్తానికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. శిక్షణలో ప్రతిభ చూపినవారు చెల్లించిన ఫీజు మొత్తాన్నీ తిరిగి పొందవచ్ఛు 90 శాతం కంటే ఎక్కువ స్కోర్‌ సాధిస్తే వంద శాతం ఫీజు, 86 నుంచి 90 శాతం స్కోర్‌ వచ్చినవారికి 50 శాతం ఫీజు వెనక్కి ఇచ్తేస్తారు.

ట్రెయినింగ్‌లో చేరిన విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా యూజీ విద్యను కొనసాగించుకోవచ్చు. శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ-తంజావూరు అందించే బీఎస్సీ (డిజైన్‌ అండ్‌ కంప్యూటింగ్‌) లేదా బీసీఏ చదువుకోవచ్చు. అనంతరం ఇదే సంస్థ అందించే ఎంసీఏలో చేరవచ్చు లేదా బిట్స్‌ పిలానీ నుంచి ఎమ్మెస్సీ, ఎంటెక్‌ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: https://registrations.hcltechbee.com/HCL/

దరఖాస్తు చేశారా?

* ఏపీలో 1,170 జీడీఎంఓ పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. చివరి తేది: ఏప్రిల్‌ 23, 2020

* ఏపీలో గ్రామ/ వార్డు వలంటీర్లు

అర్హత: గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌, పట్టణాల్లో డిగ్రీ ఉత్తీర్ణత, స్థానికులై ఉండాలి. చివరి తేది: ఏప్రిల్‌ 24, 2020

* ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, (సనత్‌నగర్‌) హైదరాబాద్‌

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: ఏప్రిల్‌ 26, 2020

* ఎయిమ్స్‌, బీబీనగర్‌లో టీచింగ్‌ పోస్టులు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్‌ అనుభవం. చివరి తేది: ఏప్రిల్‌ 27, 2020

* హైట్స్‌లో వివిధ ఖాళీలు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, బీకాం/ ఎంకాం/ ఎంబీఏ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: ఏప్రిల్‌ 28, 2020

* సమీర్‌లో సైంటిస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: ఏప్రిల్‌ 30, 2020

ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.