ETV Bharat / business

ఒక్క ఐడియాతో వారి జీవితం సూపర్ హిట్​

జీవితంలో ఏదో సాధించాలనే తపన అందరిలోనూ ఉంటుంది. ఈ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం చేయాలనే కలలు ఎన్నో ఉంటాయి. ఆ క్రమంలో ఎన్నో వినూత్న ఆలోచనలు వస్తాయి. అయితే, అందరూ వాటిని అమలు చేసే ధైర్యం చేయరు. కానీ, ఆ ఐదుగురు మాత్రం వారికొచ్చిన చిన్న ఆలోచనకు వాస్తవ రూపాన్నిచ్చారు. ఒంటరిగా అడుగేసి.. కొద్ది రోజుల్లోనే వేల కోట్లకు అధిపతులయ్యారు . ఇంతకీ ఎవరు వారు?

Indian origin wealthiest startup owners
ఒక్క ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది!
author img

By

Published : Jun 23, 2020, 6:31 PM IST

ఉద్యోగం లేక... ఉన్న జీతాలు చాలక కష్టంగా బతుకీడుస్తున్న సమయంలో వచ్చిన ఓ వ్యాపారాలోచనలకు జీవం పోసి.. యావత్​ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు కొందరు భారత యువకులు. ఇది వర్కవుట్​ అయ్యేపని కాదని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా.. వెనకడుగు వేయకుండా అంకుర సంస్థలు స్థాపించి ప్రపంచ ​ ధనవంతుల జాబితాలో చేరిపోయిన ఆ స్టార్టప్​ యజమానల విజయగాథలు ఇవి...

  • 1. రితేశ్​ అగర్వాల్​ - ఓయో
    Indian origin wealthiest startup owners
    రితేశ్​ అగర్వాల్​

ఇప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్లినా హోటల్ రూమ్స్​ కోసం లగేజీ పట్టుకుని తిరగకుండా.. ఫోన్​లోనే బుక్ చేసుకుంటున్నాం. ఈ సౌలభ్యం మనకు పరిచయం చేసింది రితేశ్​ అగర్వాల్​. ఈ 26 ఏళ్ల భారతీయుడు.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు.. తండ్రి పంపిన పాకెట్​మనీతో ఓయో రూమ్స్​ స్థాపించాడు. క్రమంగా భారత దేశవ్యాప్తంగా.. ఆ తర్వాత అమెరికాలోనూ ఈ వ్యాపారాన్ని విస్తరించాడు. ఇప్పుడు రూ.7500 కోట్లకు అధిపతయ్యాడు.

  • 2.అంకిత్​ భాటి- ఓలా
    Indian origin wealthiest startup owners
    అంకిత్​ భాటి

ఆటోలు, ట్యాక్సీల కోసం ఎదురు చూసి చూసి, తీరా దొరికాక ఆ డ్రైవర్లతో బేరం ఆడలేక.. కాలినడకన వెళ్లలేక పడ్డ తిప్పలను దూరం చేసింది ఓలా. ఆన్​లైన్​లో బుక్​చేసుకుంటే.. మీరున్న చోటుకే వచ్చి, బేరసారాలు లేకుండా గమ్యాన్ని చేరితే బాగుండు అనుకుని... ఓలా క్యాబ్స్​ స్థాపించాడు అంకిత్​ భాటి(33). ఆ ఒక్క ఆలోచనే ఇప్పుడు అంకిత్​ను రూ.1400 కోట్లకు అధిపతిగా మార్చింది.

  • 3. శ్రీ హర్ష మాజేటి- స్విగ్గీ
    Indian origin wealthiest startup owners
    శ్రీ హర్ష మాజేటి

కడుపులో ఆకలి గంట కొడితే.. హోటళ్లు, రెస్టారెంట్ల కోసం వెతుక్కునే పని లేకుండా... స్విగ్గీలో ఆర్డర్​ పెడితే ఆహారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డెలివరీ ఆన్​ డిమాండ్​ ఆలోచనతో ఇప్పుడు జొమాటోకు సైతం పోటీ ఇచ్చే స్విగ్గినీ స్థాపించింది శ్రీహర్ష(33). అందుకే, ఓ సాధారణ విద్యార్థి ఖాతాలో ఇప్పుడు రూ.1400 కోట్లు జమ అయిపోయాయి.

  • ​4. దివ్య గోకుల్​నాథ్​-బైజుస్​
    Indian origin wealthiest startup owners
    దివ్య గోకుల్​నాథ్​

దివ్య గోకుల్​నాథ్... ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టిపెరిగిన రవీంద్రన్​ బైజూను పెళ్లాడింది. బీటెక్​ చదివిన దివ్య ఆటల్లో ఎప్పుడూ ముందుండేది. భర్తతో కలిసి బైజూ ఆన్​లైన్ లర్నింగ్​ యాప్​ను స్థాపించి..​​ 33 ఏళ్లకే రూ.1800 కోట్లు వెనకేసుకుంది.

  • 5.దివ్యాంక్ తురఖియా - మీడియా.నెట్
    Indian origin wealthiest startup owners
    దివ్యాంక్ తురఖియా

ఏ బిజినెస్​ ప్రారంభించినా ప్రకటనలిచ్చేందుకు పేపర్​లోనే, టీవీలోనే ఓ స్లాట్​ కోసం వెతకాలి. కానీ, దివ్యాంక్​ ప్రారంభించిన మీడియా.నెట్​లో సర్వం ప్రకటనలే. అసలు ప్రకటనలకే ఓ యాప్​ సృష్టించొచ్చన్న ఆలోచనతో.. 37 ఏళ్ల దివ్యాంక్​.. రూ.1300 కోట్లు కొల్లగొట్టాడు. తన కంపెనీని 900 మిలియన్​ డాలర్లకు చైనాకు అమ్మేశాడు.

ఇదీ చదవండి:ఆలోచన భేష్​.. నేలమ్మకు కొబ్బరినార చీర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.