ETV Bharat / business

ఈ చిన్న పొరపాట్లు చేయకుంటే మీరే కోటీశ్వరులు! - కోటీశ్వరులు కావడం ఇలా

అర్థిక లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కొంత మొత్తంలో జమ చేసి ఏదైనా కొందామనే చిన్న చిన్న లక్ష్యాల నుంచి భవిష్యత్​ అవసరాలకోసం దాయలనుకుంటారు చాలామంది.  అలాంటి లక్ష్యాల సాధనలో ఎక్కువగా చేసే పొరపాట్లు, వాటిని అధిగమించడం ఎలానో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఈ చిన్న పొరపాట్లు చేయకుంటే మీరే కోటీశ్వరులు!
author img

By

Published : Aug 25, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 4:28 AM IST

బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని చాలా మంది అనుకుంటారు. అందులో కొంత మంది మాత్రమే అనుకున్నట్లు కోటీశ్వరులుగా మారతారు. కోరికకు తగ్గుట్లుగా ఆచరణ ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సమయం, అవకాశం రెండూ చేజారితే తిరిగి పొందడం అసాధ్యం అనేది ఎంత సత్యమో... పొదుపు, మదుపులూ అంతే. సరైన ఆచరణ లేకపోతే ఆర్థిక లక్ష్యాలను చేరడం కష్టం. లక్ష్య సాధనలో పొరపాట్లు దొర్లితే తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు.

ప్రస్తుతం చాలా మందిని సంపాదన విషయం అడిగితే.. వేలల్లో జీతాలు అందుకుంటున్నట్లు చెబుతారు. కానీ నెలాఖరు ఖర్చులు సరిపోక మళ్లీ అప్పుల వేటలో పడతారు. ఇక అనుకోని కారణాలతో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. అయితే ఆర్థిక ప్రణాళికను అమలు చేసేటప్పుడు దొర్లే సాధారణ పొరపాట్లు ఏంటి? వాటిని అదిగమించడం ఎలానో తెలుసుకుందాం.

ఖర్చులు అదుపులో లేకపోవడం...

ఎంత సంపాదించినా అంతా ఖర్చవుతుందని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని గణాంకాల ప్రకారం దేశంలో సంపాదించే వారిలో 52 శాతం మంది వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారని తేలింది. వీరిలో కొంత మంది ఆదాయంతో పాటు అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని అధికంగా ఖర్చులు చేస్తున్నారు. ఈ కారణంగా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను ఎప్పటికీ చేరలేకపోతున్నారు.

ఇలా జరగకుండా.. ఎక్కువ ఖర్చులు చేస్తున్నాం అని భావించినప్పుడు వాటిపై నిఘా వేయండి. ఎక్కడ వృథా ఖర్చులు అవుతున్నాయో గుర్తించండి. అవసరమైన మేరకే ఖర్చులు చేయడం.. ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కనీస ప్రణాళిక పాటిస్తే ఖర్చులు అదుపులో ఉండి.. మిగులు కనిపిస్తుంది.

పొదుపు తప్పదు...

ఆర్థిక లక్ష్యాలను చేరాలనుకుంటే మొదటగా చేయాల్సింది పొదుపు. పెరిగిన నిత్యవసరాలు, ఇతరత్రా ఖర్చులు, రుణాలపై వడ్డీలు సంపదను ఆవిరి చేస్తున్నాయని చాలా మంది అంటుంటారు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులపై ఆలోచన ఎలా అని భావిస్తుంటారు. అయితే.. పొదుపు అనేది ఖర్చు పెట్టాక మిగిలింది కాదు.. ప్రతి నెల లక్ష్యంగా పెట్టుకుని కొంత మొత్తాన్ని దాయడమే పొదుపు అనేది గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా తప్పని సరి ఖర్చులు ఎలానో అదే విధంగా పొదుపునూ తప్పని సరి జాబితాలో చేర్చుకోవాలి.

ప్రస్తుతం పొదుపు చేసిన మొత్తం విలువ ఐదేళ్ల తర్వాత ఎంతుంటుందో కచ్చితంగా చెప్పలేం. అందుకే వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వేతన జీవులు.. వారి ఆదాయంలో కనీసం 10 శాతం నుంచి 20 శాతం వరకు పొదుపు చేయాలని అర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అప్పు చేసి తిప్పలు వద్దు..

చాలా మందికి ఏదైనా కొనాలన్నా.. ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొదట గుర్తొచ్చేది అప్పే. అయితే అప్పుల్లో కొన్ని మేలు చేసేవి ఉంటాయి. మరి కొన్ని ఇబ్బందులు తెచ్చేవి ఉంటాయి. విద్యా రుణం, గృహరుణం వంటివి మేలు చేసే అప్పుల జాబితాలోకి వస్తాయి. అదే వ్యక్తిగత రుణం తీసుకుని ఇతర అవసరాలకు వాడుకోవడం, క్రెడిట్​ కార్డు ఉందని అనవసర ఖర్చులు చేయడం వంటివి ఇబ్బందులకు గురిచేసే అప్పులు. ఇవి మన ఆర్థిక స్థితిని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. వీటివల్ల సంపాదనలో ఎక్కువ భాగం అప్పులకు వడ్డీగా పోతుంది.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు అనవసర అప్పులు చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవాలి. అప్పటి వరకు అధిక వడ్డీ చెల్లిస్తున్న రుణాలను త్వరగా తిరిగి చెల్లించాలని నిశ్చయించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కోరికలను అదుపు చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ దాటితేనే ఆర్థిక లక్ష్యం సిద్ధిస్తుంది.

సరైన ప్రణాళిక లేకపోవడం..

సరైన ప్రణాళిక లేకుండా ఏదైనా పని చేస్తే.. అందులో విజయం సాధించడం కష్టం. ఆర్థిక లక్ష్యాల్లో ఇది మరీ ముఖ్యం. పొదుపు, ఖర్చులు అన్నీ సరైన ప్రణాళికతో నిర్వహించినప్పుడే ప్రతిఫలం దక్కుతుంది.

అత్యవసర నిధి లాంటివి ఇందులోకే వస్తాయి. పొదుపుల్లో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగా.. ఏదైనా అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు పొదుపు అదుపు తప్పుతుంది. ఇందుకోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్రతినెల అందులోనూ కొంత మొత్తంలో పొదుపు చేస్తూ ఉండాలి.

ఉన్న సొమ్మంతా ఒకే దగ్గర మదుపు చేయడం అనేది మంచి ఆర్థిక సూత్రం కాదు. పెట్టుబడి పెట్టదలచిన మొత్తాన్ని వివిధ మదుపు మార్గాల్లో (బంగారం, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా, బాండ్లు) పెట్టుబడిగా పెట్టాలి. దీని ద్వారా లాభ నష్టాలను సమతుల్యం చేసుకోవచ్చు.

నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రణాళికను అమలు చేసినప్పుడే విజయం సాధించగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇదీ చూడండి: మీ పిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వండిలా..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Biarritz - 24 August 2019
1. French President Emmanuel Macron entering cultural centre
2. Macron greeting local politicians
3. Various of Macron greeting local entrepreneur
4. Macron presented with Basque pelota basket used as a racket in the local sport
5. Various of Macron visiting a technology exhibit
6. Macron walking on stage
7. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"We must move forward on the international stage (in regards to environmental protection), but if that is not reflected by action on the ground it won't work. To illustrate this, for the first time, during this G7, we will launch a group of actions for the textile industry. The textile industry is the second most polluting sector in the world after hydrocarbon."
8. Cutaway
9. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"We've managed to mobilize businesses and we have from Nike, to Adidas, Zara, H&M, all these brands have mobilized and the state is helping them, and they will completely transform their practices, to have more responsible practices and therefore reduce the pollutants."
9. Tilt up on document given to Macron by the region
10. Various of Macron greeting people
STORYLINE:
French President Macron visited a cultural centre in Biarritz on Saturday morning, ahead of receiving world leaders attending the G7 summit.
Macron opened a cultural and business centre showcasing techological advances, culture and business opportunities in the southwest region of France playing host to the international meeting.
Addressing the urgent need for coordinated efforts to reduce greenhouse gas emissions, Macron announced a new initiative to reduce pollution created by the textile industry.
A group of 32 leading companies in the fashion and textile industry have given themselves a set of shared goals under a "Fashion Pact" aimed at reducing the environmental impact of their business.
The pact focuses on three key areas: global warming, biodiversity and reduction of the use of single-use plastics in the oceans.
Others who signed on include Adidas, Hermes and Nike.
The initiative will be presented at the G7 meeting starting in Biarritz on Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 4:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.