ETV Bharat / business

త్వరలో జాన్సన్​ & జాన్సన్​ కరోనా వ్యాక్సిన్!

కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారీకి పూనుకుంది ప్రముఖ ఆరోగ్య ఉత్పత్తుల తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్. ఈ ఏడాది సెప్టంబరు నాటికి మానవునిపై పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది.

Human testing for Johnson & Johnson coronavirus vaccine this fall
మానవునిపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధం!
author img

By

Published : Mar 31, 2020, 1:21 PM IST

ప్రముఖ ఆరోగ్య ఉత్పత్తుల తయారీ సంస్థ జాన్సన్​ & జాన్సన్.. కరోనా నియంత్రణకై వ్యాక్సిన్​ ప్రయోగానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మానవునిపై పరీక్షలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది ప్రారంభంలో అత్యవసర వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపింది.

ఈ ప్రయత్నంలో భాగంగా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు.. అమెరికా ప్రభుత్వ బయోమెడికల్​ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. జనవరిలోనే కరోనాకు టీకా కనుగొనేందుకు జాన్సన్​ సంస్థ పనులు ప్రారంభించింది. ఎబోలా వైరస్​ కోసం వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఇందుకు ఉపయోగిస్తోంది.

ప్రయోగంలో ఉత్తమ ఫలితం కోసం అనేక జంతవులపై పరీక్షలు నిర్వహించాం. జనవరి 15 నుంచి ఇప్పటివరకు 12 వారాలు పట్టింది. ఓ వైపు ఈ వ్యాక్సిన్​ ఎలా పని చేస్తుందో నిర్ధరించుకోవాలి. మరో వైపు ఎక్కువగా పని చేయాలి.

-పాల్​ స్టాఫెల్స్​, జాన్సన్ అండ్ జాన్సన్ ప్రధాన పరిశోధనాధికారి

ఇప్పటి వరకు కరోనా సంబంధిత వ్యాధులకు ఎలాంటి వ్యాక్సిన్లు కనుగొనలేనప్పటికీ.. ఈ సమస్యను తాము అధిగమించగలమని స్టోఫెల్స్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు.. అమెరికా సహా, ఇతర దేశాలలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.