ETV Bharat / business

ఇంటికే కాదు ఇంట్లోని వస్తువులకూ బీమా! - బిజినెస్ న్యూస్

ప్రకృతి వైపరీత్యాలు.. దొంగతనాలు.. అనుకోని ప్రమాదాల కారణంగా ఎంతో విలువైన ఇంటికే కాదు.. అందులోని ఖరీదైన వస్తువులకూ వాటిల్లే ఆర్థిక నష్టం నుంచి సులభంగా బయటపడాలంటే ఏకైక సాధనం 'హౌస్‌హోల్డర్స్‌' పాలసీ. ఈ పాలసీ ఎలా పని చేస్తుంది? పాలసీ కొనేముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం.

'హౌస్‌హోల్డర్స్‌' పాలసీ
author img

By

Published : Jul 28, 2019, 3:00 PM IST

వర్షాకాలం వచ్చింది. ఏటా వర్షాకాలంలో ఇళ్లు నీట మునిగి భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది అనే వార్తలు వింటూనే ఉంటాం. వాటి నుంచి కోలుకుని మళ్లీ వస్తువులన్నింటినీ కొనుక్కోవాలంటే భారీగా ఖర్చులు అవుతుంటాయి. ఈ ఏడాది వర్షాలకు ఏదైనా నష్టం జరిగితే ఖర్చులు భరించడం కాదు.. ఒక బీమా తీసుకుంటే సరిపోతుంది. అదే 'హౌస్‌హోల్డర్స్‌' పాలసీ. ఇంతకీ అది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.

ఇంటితోపాటు అందులో నివసించే వ్యక్తులు, ఉండే వస్తువులకు కూడా బీమా రక్షణ కల్పించటం 'హౌస్‌హోల్డర్స్‌' పాలసీ ప్రత్యేకత. సొంతిల్లు ఉన్న వారంతా 'హౌస్‌హోల్డర్స్‌' పాలసీ తీసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాలన్న తేడా ఏమీ ఉండదు.

మీకు కావాల్సిన సెక్షన్​ మీరే నిర్ణయించుకోండి

హౌస్‌హోల్డర్స్‌ పాలసీలో పది సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ ఒక్కో రకం నష్టానికి పరిహారం ఇస్తుంది. మీ అవసరాలను బట్టి కావాల్సిన సెక్షన్లను ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు.. సెక్షన్‌ 1ఎ ఇంటికి వర్తిస్తుంది. సెక్షన్‌ 1బి ఇంట్లోని వస్తువులకు వర్తిస్తుంది. ఇందులో సెక్షన్‌ 1బి తప్పనిసరిగా ఎంచుకుని, మిగిలినవాటిలో మీ అవసరాన్ని బట్టి కావాల్సిన సెక్షన్​ ఎంచుకోవచ్చు.

వివిధ సెక్షన్ల కింద...

  • ఇంటికి, ఇంట్లోని వస్తువులకు..
  • దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నా..
  • అగ్నిప్రమాదం సంభవించి గృహోపకరణాలు ధ్వంసమైనా..
  • షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల టీవీ, కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైనా..
  • సైకిల్‌ అపహరణకు గురైనా (బైకుకు వాహన బీమా ఉంటుంది)..
  • ప్రయాణ సమయాల్లో లగేజీని అపహరించినా పరిహారం లభిస్తుంది.

ప్రకృతి ప్రకోపాల నుంచి ఉగ్రవాదుల దాడుల వరకు కారణం ఏదైనా... బీమా అండగా నిలుస్తుంది.

ఖర్చు తక్కువే..

గృహ బీమా పాలసీకి ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ఇంటి వైశాల్యం, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణం తీరు వంటి అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.

ఇంటికీ, ఇంట్లోని వస్తువులకూ కలిపి రూ.లక్ష బీమా పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.50-100కు మించదు. టీవీ, ఫ్రిజ్‌, ఎల్‌ఈడీ టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కలిపి రూ.లక్ష వరకూ పాలసీ తీసుకుంటే.. రూ.1,100 వరకు ప్రీమియం ఉంటుంది. అన్ని సెక్షన్లనూ కలిపి తీసుకున్నా.. రూ.లక్షకు ప్రీమియం ఖర్చు రూ.2,000 దాటదు. మీరు బీమా తీసుకోవాలనుకున్న సంస్థను బట్టి ప్రీమియం ఉంటుంది. వీటిపై జీఎస్టీ చార్జీలు అదనం.

పాలసీలో ముందు చూడాల్సిన అంశాలివే..

పాలసీ తీసుకునే ముందు అన్ని నియమ నిబంధనలను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించాలి. వీలైనన్ని ఎక్కువ వస్తువులకు బీమా వర్తించే పాలసీని ఎంచుకోవడం మేలు.

ఇంటి నిర్మాణం విలువ, ఇంట్లోని వస్తువుల విలువను లెక్కించి, దానికి అనుగుణంగా పాలసీ మొత్తాన్ని ఎంచుకోవాలి.

పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వేటికి వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే వివరాలు సేకరించాలి. చాలావరకు పాలసీలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిహారం ఇస్తుంటాయి. యుద్ధ సమయంలో జరిగిన నష్టానికి మాత్రం ఇవి పరిహారం ఇవ్వవు.

ప్రీమియం మాటేమిటి? ఏమైనా రాయితీలు ఇస్తున్నారా? ఒకే వ్యక్తి రెండు మూడు హోం ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుంటే ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా అనేది చూసుకోండి.

క్లెయిం కోసం..

ఇంటికిగానీ, ఇంట్లోని వస్తువులకు గానీ నష్టం జరిగినప్పుడు పరిహారాన్ని క్లెయిం చేసుకునేముందు పాలసీదారుడు చేయాల్సిన పనులేమిటంటే...

సాధ్యమైనంత తొందరగా జరిగిన నష్టం, కారణం గురించి బీమా కంపెనీకి తెలియజేయండి. ఆలస్యం చేస్తే క్లెయిం నిరాకరణకు గురికావచ్చు.

నిర్ణీత గడువులోగా క్లెయిం కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయండి. ఇందులో నష్టం జరిగిన వస్తువుల వివరాలు, వాటి విలువలను కచ్చితంగా లెక్కించాలి? ఎంత పరిహారం కోరుతున్నారు? అనే విషయాలను పరిహారంలో పొందుపరచాలి.

బీమా సంస్థ క్లెయింకు ముందు పరీశీలన అధికారి (సర్వేయర్), సంస్థ అధికారులు ఎవరైనా వస్తే అవసరమైన పత్రాలు చూపించడం సహా వారడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిం కోసం పాత నష్టాలను జోడించకూడదు.

బీమా ఇచ్చే సంస్థలు

న్యూ ఇండియా, ఓరియంటల్‌, యునైటెడ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, బజాజ్‌ అలియాంజ్‌, రాయల్‌ సుందరం, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తదితర బీమా సంస్థలన్నీ ఈ పాలసీని ఇస్తున్నాయి.

ఇదీ చూడండి: అప్పుడప్పుడూ క్రెడిట్ కార్డు వాడకం మంచిదే

SNTV Daily Planning, 0700 GMT
Sunday 28th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
CYCLING: Highlights from the final stage of the Tour de France. Expect at 2030.
CYCLING: Reaction following final stage of the Tour de France in Paris. Expect at 2130.
CYCLING: Fans in Egan Bernal's home town watch him try to become the first Colombian and youngest rider for 110 years to win the Tour de France. Expect at 2230.
SOCCER: AC Milan and Benfica meet in the International Champions Cup in Foxborough, Massachusetts, USA. Expect at 2130.
SOCCER: Jiangsu Suning v Shenzhen in Chinese Super League. Expect at 1400.
SOCCER: Guangzhou Evergrande v Beijing Renhe in Chinese Super League. Expect at 1430.
SOCCER: Wuhan Zall v Shanghai SIPG in Chinese Super League. Expect at 1430.
FORMULA 1: Digitally-cleared coverage from the German Grand Prix, Hockenheim, Germany. Expect at 1730.
MOTORSPORT: Highlights of the MXGP of Czech Republic. Expect at 1800.
MOTORSPORT: Highlights from the FIM Endurance World Championships, Suzuka 8 Hours in Japan. Expect at 1800.
MOTORSPORT: Highlights from the Blancpain GT Series 24 Hours of Spa in Belgium. Expect at 2000.
GOLF: Final round action from the LPGA Evian Championship in Evian, France. Expect at 1600.
TENNIS: Andrey Rublev versus Nikoloz Basilashvili in the final of the ATP World Tour 500 Hamburg European Open. Expect at 1400.
TENNIS: Cedrik-Marcel Stebe v Albert Ramos Vinolas in the final of the ATP World Tour 250 Swiss Open. Expect at 1300.
TENNIS: Kiki Bertens v Jil Teichmann in the final of the WTA Palermo Open in Italy. Expect at 2100.
CRICKET: Highlights from the second ODI between Sri Lanka and Bangladesh in Colombo. Expect at 1600.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.