బ్రిటన్లో ఆసియాకు చెందిన అత్యంత ధనికులుగా 25.2 బిలయన్ పౌండ్ల సంపదతో హిందూజా కుంటుంబం మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించడం విశేషం. గతేడాదితో పోలిస్తే హిందూజా కుటుంబం సంపద 3 బిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.
ఉక్కు పారిశ్రామిక దిగ్గజం లక్షీ మిట్టల్ కుటంబం 11.2 బిలియన్ పౌండ్ల సంపదతో రెండో స్థానం దక్కించుకుంది. వీరి సంపద 2.8 బిలయన్ డాలర్లు తగ్గింది. బ్రిటన్లో ఆసియాకు చెందిన 101 ధనికుల జాబితా 'ఏషియన్ రిచ్ లిస్ట్-2019' ని భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ విడుదల చేశారు. ఎస్ పీ లోహియా కుటంబం 5.8బిలయన్ పౌండ్ల సంపదతో మూడోస్థానంలో నిలిచింది.
ఎంపిక చేసిన 101 మంది ధనికుల మొత్తం సంపద 85.2 బిలయన్ పౌండ్లు. ప్రతి ఏటా వీరి సంపద పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది 5 బిలయన్ పౌండ్లు వృద్ధి నమోదైంది.
ఈ ఏడాది ఏడుగురు కొత్త ఎన్ఆర్ఐలకు ఈ జాబితాలో స్థానం లభించింది.
లండన్లో పురాతన యుద్ధ కార్యాలయాన్ని 250ఎళ్లకు లీజుకు తీసుకున్న హిందుజా సంస్థ దానిని విలాసవంతమైన నివాసాలుగా మార్చి వ్యాపారం చేస్తోంది.