ETV Bharat / business

భారత మార్కెట్​పై హార్లీ డేవిడ్​సన్​ కీలక నిర్ణయం - హార్లీ డేవిడ్​సన్ లేటెస్ట్ న్యూస్

భారత్​లో ప్రస్తుత బిజినెస్ మోడల్​ నుంచి తప్పుకుంటున్నట్లు లగ్జరీ బైక్​ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్​సన్​ గురువారం అధికారికంగా ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వినియోగదారులకు డీలర్​ నెట్​వర్క్​ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

Harley-Davidson exit India
భారత మార్కెట్​పై హార్లీ డెవిడ్ సన్ కీలక నిర్ణయం
author img

By

Published : Sep 24, 2020, 8:06 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్​ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్​సన్ భారత్​లో ప్రస్తుత బిజినెస్ మోడల్​ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

బవాల్​ (హరియాణా)లో కంపెనీకి ఉన్న ఫ్యాక్టరీని మూసివేసేయడం, గురుగ్రామ్​ విక్రయ కేంద్రంలో అమ్మకాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీకి చెందిన ఓ వ్యక్తి తెలిపారు.

విక్రయాలు క్షీణించడం సహా ఇతర కారణాలతో పలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా గత కొన్నాళ్లుగా హార్లీ కార్యకలాపాలను విరమించుకుంటూ వస్తుండటం గమనార్హం.

కంపెనీ డీలర్​ నెట్​వర్క్ మాత్రం.. కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగదారులకు సేవలందించనున్నట్లు హార్లీ వెల్లడించింది.

దేశీయంగా తమ వ్యాపార కార్యాకలాపాలను నిర్వహించేందుకు ఇతర కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని హార్లీ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కంపెనీ కార్యకలాపాలను కూడా పునర్​వ్యవస్థీకరించాలని హార్లీ భావిస్తోంది. రానున్న 12 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి:హార్లీ భారత మార్కెట్ నుంచి వైదొలిగేందుకు మరిన్ని కారణాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.