కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కారణంగా జీఎస్టీ మండలి 36వ సమావేశం వాయిదా పడింది. సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు సమావేశం నిర్వహించాలని మండలి భావించింది.
విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉంది.
సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీ పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాలని మండలికి దిల్లీ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపైనా సమీక్షించాల్సి ఉంది.
జీఎస్టీ సమావేశం నూతన తేదీని త్వరలో వెల్లడిస్తామని కౌన్సిల్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఏడాదిలో వాట్సాప్ పేమెంట్ సేవలు