వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్లో గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్లో కేవలం రూ.91,916 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు సెప్టెంబర్లో నమోదైన వసూల్లే అత్యల్పం.
ఈ ఏడాది ఆగస్టులో రూ.98,202 కోట్ల జీఎస్టీ వసూలవ్వగా.. గత ఏడాది సెప్టెంబర్లో రూ.94.442 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్ల వివరాలు..
- మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లు
- కేంద్ర జీఎస్టీ-రూ.16,630 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ-రూ.22,598 కోట్లు
- సమీకృత జీఎస్టీ-రూ.45,069 కోట్లు
ఇదీ చూడండి: భారత్కు శాంసంగ్ మడత ఫోన్- ధరెంతో తెలిస్తే షాక్!