బ్యాంకుల స్థూల నిరర్ధక రుణాల నిర్వహణ(గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ లోన్స్) మెరుగుపడినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇది 9.1 శాతానికి చేరినట్టు పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 11.2 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది.
అన్ని వాణిజ్య బ్యాంకుల నికర నిర్ధక ఆస్తుల (ఎన్పీఏ) 2019-20 ఆర్థిక సంవత్సరంతో 3.7 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ రుణ సంస్థల్లో ఆస్తుల నిర్వహణ మెరుగుపడటం.. స్థూల, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి తగ్గుదలకు కారణంగా ఆర్బీఐ పేర్కొంది.
స్థూల ఎన్పీఏ, నికర ఎన్పీఏల నిష్పత్తి తగ్గడం వల్ల.. ప్రభుత్వం ఆస్తుల నిర్వహణ మెరుగుపడిందని ఆర్బీఐ అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్