ETV Bharat / business

ఆ గ్యాస్​ను.. అనుబంధ సంస్థలకు విక్రయించొచ్చు - gas reforms latest news

ఇకపై.. క్రమబద్ధీకరించని క్షేత్రాల్లో ఉత్పత్తి అయిన గ్యాస్​ను ఉత్పత్తి సంస్థల నుంచి వాటి అనుబంధ సంస్థలు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ మేరకు అనుమతినిచ్చింది. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వంటి కంపెనీలకు ఈ నిర్ణయం కలిసొచ్చే అంశం.

govt allows reliance others to sell gas to affiliates
ఆ గ్యాస్​ను.. అనుబంధ సంస్థలకు విక్రయించొచ్చు
author img

By

Published : Oct 8, 2020, 8:11 AM IST

క్రమబద్ధీకరించని క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయిన గ్యాస్‌ను ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలు చూసే మంత్రివర్గ సంఘం సహజ వాయువు మార్కెటింగ్‌ సంస్కరణలకు ఆమోదం తెలిపిందని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు.

ఆ కొనుగోలుపై నిషేధమే!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి కంపెనీలకు తాజా నిర్ణయం కలిసొచ్చే అంశం. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చినవి మినహా, 2016 నుంచి 2019 మధ్య మిగిలిన క్షేత్రాల్లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకే ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఉత్పత్తిదారులు సొంత గ్యాస్‌ కొనుగోలు చేసుకోవడంపై నిషేధం కొనసాగుతుంది. వాటి అనుబంధ సంస్థలు మాత్రం గ్యాస్‌ కొనుగోలు, క్షేత్రాల వేలంలో పాల్గొనవచ్చు.

ఇదీ చూడండి:ఎంఎస్​ఎంఈలకు వడ్డీ రాయితీ పథకం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.