దేశంలో రెమ్‌డెసివిర్ ఔషధ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4.5 లక్షల వయల్స్ రెమ్‌డెసివిర్ ఔషధాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో 75 వేల వయల్స్ శుక్రవారమే భారత్‌కు చేరొచ్చని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఫలితంగా రెమ్‌డెసివిర్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. దీనితో ఆ ఔషధానికి కొరత ఏర్పడింది.
ఈ కొరతను తీర్చేందుకు గానూ.. ప్రభుత్వ రంగ ఆరోగ్య సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్.. 4.5 లక్షల వయల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాకు చెందిన గిలీద్ సైన్సెస్ ఇంక్, ఈజిప్ట్‌కు చెందిన ఈవా ఫార్మాలు ఈ మొత్తాన్ని భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయి.
రానున్న ఒకటి లేదా రెండు రోజుల్లో 75 వేల నుంచి లక్షల వయల్స్‌ను గిలీద్ సైన్సెస్ సరఫరా చేయనుంది. మే 15 లోపు మరో లక్ష వయల్స్‌ను పంపనుంది.
ఈవా ఫార్మా తొలుత 10 వేల వయల్స్‌ను సరఫరా చేయనుంది. ఆ తర్వాత జులై వరకు 15 రోజులకు ఓ సారి 50 వేల వయల్స్ చొప్పున భారత్‌కు ఎగుమతి చేయనుంది.