ETV Bharat / business

గూగుల్ అదిరే అప్​డేట్స్- పిక్సల్​ శ్రేణిలో 2 ఫోన్స్

author img

By

Published : May 8, 2019, 2:52 PM IST

గూగుల్​ మ్యాప్స్​, గూగుల్​ అసిస్టెంట్​... రోజువారీ జీవితంలో ఎంతో కీలకమయ్యాయి. వీటిని మెరుగుపరిచేందుకు సిద్ధమైంది గూగుల్. త్వరలోనే రానున్న అప్​డేట్స్​ వివరాలను ప్రకటించింది. పిక్సల్​ శ్రేణిలో 2 కొత్త మోడళ్లనూ విడుదల చేసింది.

గూగుల్​

కృత్రిమ మేధ సహాయక సేవల్లో ఈ ఏడాది కీలక అప్​డేట్​లు తీసుకురానున్నట్లు టెక్​ దిగ్గజం గూగుల్​ ప్రకటించింది

కొత్త అప్​డేట్​లో గూగుల్​ అసిస్టెంట్​ సహాయంతో అద్దెకు కార్లు, సినిమా టికెట్లు ఆటోమాటిక్​గా బుక్​ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన డెవలపర్స్​ వార్షిక సదస్సులో గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ వెల్లడించారు.

గూగుల్​ మ్యాప్​లో ఇన్​కాగ్నిటో

యాక్టివిటీ హిస్టరీ రికార్డు కాకుండా 'ఇన్​కాగ్నిటో' సదుపాయాన్ని గూగుల్​ మ్యాప్​లోనూ ప్రవేశపెట్టనున్నట్లు సుందర్​ పిచాయ్ పేర్కొన్నారు. హిస్టరీ రికార్డులు నిల్వ ఉండకూడదనుకుంటే ఆటోమేటిక్​గా తొలగించే ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ముందే కమాండ్​ ఇవ్వడం ద్వారా నిర్ణీత సమయం వరకే గూగుల్​ మ్యాప్ హిస్టరీని సేవ్ చేసే సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు సుందర్​.

ప్రాజెక్ట్ యూఫోనియా

స్పష్టంగా మాట్లాడలేని వారి మాటలను అర్థం చేసుకునే సాంకేతికతను రూపొందించే దిశగా తమ నిపుణులు పరిశోధనలు చేస్తున్నట్లు గూగుల్​ పేర్కొంది. తద్వారా అలాంటి వారి అవసరాలను అర్థం చేసుకుని, సేవలు అందించే వీలు కలుగుతుందని గూగుల్ తెలిపింది.

ఈ అప్​డేట్లన్నీ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ ప్రకటించింది.

పిక్సల్ శ్రేణిలో మరో రెండు కొత్త ఫోన్లు

గూగుల్ పిక్సల్ స్మార్ట్​ ఫోన్ల శ్రేణిలో మరో రెండు కొత్త ఫోన్లు ఆవిష్కరించింది గూగుల్​. పిక్సల్​ 3ఏ, పిక్సల్ 3ఏ ఎక్స్ఎల్​ మోడళ్లు విడుదల చేసింది.

భారత విపణిలో వీటి ధర రూ.39,999 నుంచి రూ.44,999 మధ్య ఉండనున్నట్లు గూగుల్ తెలిపింది. మే 15 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.

ఫీచర్లు పిక్సల్​ 3ఏ పిక్సల్​ 3ఏ ఎక్స్​ఎల్
తెర 5.6 అంగుళాలు 6 అంగుళాలు
ర్యామ్​/స్టోరేజి 4జీబీ/64జీబీ 4జీబీ/64జీబీ
కెమెరా 12.2/8 మెగా పిక్సల్ 12.2/8 మెగా పిక్సల్
బ్యాటరీ 3,000 ఎంఏహెచ్​ 3,700 ఎంఏహెచ్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.