అంతర్జాలంలో తమ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత పటిష్ఠం చేసేందుకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.
భద్రత పరంగా వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు ఈఏడాది సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రకటించాయి.
భద్రతా ప్రమాణాలు పెంచే విషయంలో గూగుల్ ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో నిర్దిష్ట సమయం వరకు వీడియోల హిస్టరీని డిలీట్ చేసే వీలును వినియోగదారులకు కల్పిస్తోంది గూగుల్. గూగుల్ అసిస్టెంట్‌కు వినియోగదారులు ఇచ్చిన వాయిస్ కమాండ్లనూ తొలగించే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఇన్‌కాగ్నిటో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు తిరిగే ప్రాంతాలేవీ.. మ్యాప్స్‌లో నమోదు కావు. ఈ నెలాఖరుకు ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ యూజర్లకు ఈ సదుపాయం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది స్పష్టతనివ్వలేదు గూగుల్.
ఇదీ చూడండి: మెక్రోసాఫ్ట్ నుంచి రెండు తెరల మడతఫోన్!