ETV Bharat / business

'భారత్‌లో 'గూగుల్‌ పే'ను నిషేధించలేదు'

దిగ్గజ సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​ సంస్థకు చెందిన 'గూగుల్​ పే'ను.. భారతీయ రిజర్వ్​ బ్యాంకు నిషేధించలేదని రిటైల్​ చెల్లింపుల సాధికార సంస్థ 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)' స్పష్టం చేసింది. చెల్లింపుల వ్యవస్థను నిర్వహించకపోవడం వల్ల అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది.

Google pay is not banned but is authorised and protected by law NPCI clarifies
భారత్‌లో 'గూగుల్‌ పే'ను నిషేధించలేదు:ఎన్‌పీసీఐ
author img

By

Published : Jun 27, 2020, 4:08 PM IST

ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ 'గూగుల్‌ పే'ను భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధించలేదని... రిటైల్‌ చెల్లింపుల సాధికార సంస్థ 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)' స్పష్టం చేసింది. దీనితో గూగుల్‌ పే నిషేధానికి గురైందంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల జరుగుతున్న ప్రచారానికి ఇంతటితో తెరపడింది.

ఆర్థికవేత్త అభిజీత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు సంస్థకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని కూడా ఆర్‌బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

అయితే ఈ వివరణను పెడచెవిన పెట్టిన కొందరి ద్వారా... సామాజిక మాధ్యమాల్లో ఆర్‌బీఐ, గూగుల్‌ పేను నిషేధించిందంటూ ప్రచారం ఊపందుకోవటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో "గూగుల్ పే ను 'థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌'గా రిజర్వు బ్యాంకు గుర్తించింది. ఈ సంస్థ చట్టబద్ధమైనదని, దీని ద్వారా జరిగే లావాదేవీలన్నీ సురక్షితమైనవని ఆర్‌బీఐ నిర్ధరించింది." అంటూ ఎన్‌పీసీఐ చేసిన ప్రకటనతో ఈ విషయంపై వినియోగదారులకు స్పష్టత వచ్చింది.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​కు రూ.54 వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.