ETV Bharat / business

పిచాయ్​కు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది? - గూగుల్​కు షాక్​

గూగుల్​ అంతర్గత వ్యవహారాల్లో మరోసారి అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సంస్థ చీఫ్​ హెచ్ఆర్​​ రాజీనామా చేశారు. గత ఏడాది చివర్లో గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​ పిచాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2019 క్యూ4లో ఆశించిన లాభాలు రాలేదు. ఇలా ఇప్పటికే పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది పిచాయ్​. వాటిని మరవకముందే మరో సారి హెచ్​ఆర్ చీఫ్​ రాజీనామా తెరపైకి వచ్చింది.

sunder pichai
పిచాయ్​కు వరుస షాక్​లు
author img

By

Published : Feb 11, 2020, 6:19 PM IST

Updated : Mar 1, 2020, 12:23 AM IST

సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్​ను వరుస కష్టాలు వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్​లు సీఈఓ సుందర్​పిచాయ్​ నేతృత్వంలో ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్లో దూసుకుపోతుంటే.. అంతర్గత వ్యవహారాల్లో మాత్రం గత కొంతకాలంగా లుకలుకలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ గూగుల్ మానవ వనరుల శాఖ (హెచ్​ఆర్​) ఉపాధ్యక్ష పదవికి ఎలీన్​ నౌటన్ రాజీనామా. ఆమె రాజీనామా విషయాన్ని గూగుల్ సోమవారం అధికారికంగా వెల్లడించింది.

"గూగుల్​లో ఎలీన్​ అందించిన సేవలకు కృతజ్ఞతతో ఉన్నాం." అని గూగుల్​, మాతృ సంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్​పిచాయ్​ ఓ ప్రకటనలో తెలిపారు. ఎలీన్​ గూగుల్​లో పని చేసిన కాలంలో దాదాపు 70,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నారు.

"నా భర్త, నేను మొదట లండన్​లో, ఇప్పుడు శాన్​ఫ్రాన్సిస్కోలో ఆరు సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు ఇక కుటుంబానికి దగ్గరగా న్యూయార్క్​లో ఉండాలని నిర్ణయించుకున్నాం" అని నౌటన్ చెప్పడం గమనార్హం. అయితే గూగుల్​ను వీడినా.. తన స్థానాన్ని భర్తీ చేసే అధికారిని నియమించేందుకు సంస్థ సీఈఓ సుందర్​ పిచాయ్​, సీఎఫ్​ఓ రుత్​ పోర్ట్​లకు సహకరిస్తానని స్పష్టం చేశారు ఎలీన్​.

లాభాల నిరాశ..

గత ఏడాది చివరి త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టలేకపోయింది గూగుల్​. ఇప్పుడు కీలక పదవి నుంచి నౌటన్ తప్పుకోవడం వల్ల పిచాయ్​ ముందుకు మరో కొత్త సవాలు వచ్చినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్ వరుస సవాళ్లు..

గత కొంత కాలంగా గూగుల్​ అంతర్గత వ్యవహారాల్లో పలు అంశాలు చర్చకు దారితీశాయి. అందులో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను సంస్థ ఉద్యోగులే వ్యతిరేకించడం వంటి అంశాలు ఉన్నాయి.

గత ఏడాది నవంబర్​లో డేటా సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించిన కారణంగా నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది గూగుల్​. ఈ వ్యవహారంలో ఉద్యోగులను వేధిస్తోందని గూగుల్​పై ఆరోపణలు వచ్చాయి.

అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో.. అమెరికా కస్టమ్స్​, సరిహద్దు పోర్టల్​ ఏజెన్సీలతో కలిసి గూగుల్ పని చేయడాన్ని సంస్థ ఉద్యోగులే వ్యతిరేకించారు.

పారితోషికం పెంపుపై విమర్శలు..

సుందర్​ పిచాయ్​ పారితోషికం ఇటీవల భారీగా పెంచడాన్ని కొంత మంది ఉద్యోగులు బాహాటంగానే విమర్శించారు.
గూగుల్‌ సంస్థలో అంతర్గత సంఘర్షణల అణచివేత అనంతరం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సంవత్సరం జరిగిన ఒక ఉద్యోగుల సమావేశంలో "సిలికాన్‌ వ్యాలీలో ఎంతో మంది ఉద్యోగులు తమ మనుగడ కోసం కష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిచాయ్‌కు అంత పారితోషికం అవసరమా?" అంటూ ఒక ఉద్యోగి ప్రశ్నించారు.

లైంగిక వేధింపుల అంశం..

2018లో సంస్థలో లైంగిక వేధింపుల అంశం సంస్థను కుదిపేసింది. అప్పట్లో గూగుల్ మౌంట్​వ్యూ క్యాంపస్​ సహా ప్రపంచ దేశాల్లో సంస్థ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇదీ చూడండి:ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందుల్లో లేదు: నిర్మల

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/neck-to-neck-battle-for-patparganj-seat-as-deputy-cm-manish-sisodia-trails-bjps-ravinder-singh-negi20200211113025/

Conclusion:
Last Updated : Mar 1, 2020, 12:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.